Categories: TOP STORIES

గల్ఫ్ ఎన్నారైల భారత పెట్టుబడులకు కారణాలేంటి?

భారతీయ రియల్ మార్కెట్ పై గల్ఫ్ లో ఉంటున్న ప్రవాస భారతీయుల (ఎన్నారైల) ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికపరమైన లాభాలు, సెంటిమెంట్ అంశాల ప్రాతిపదికన పెట్టుబడులు పెట్టే ఈ పెట్టుబడిదారులు అధిక రాబడి, వైవిధ్యం, రెండో ఇల్లు వంటివాటిని చూసి ముందడుగు వేస్తున్నారు. ఆస్తి విలువ పెరగడం దగ్గర నుంచి అనుకూలమైన మారకపు రేట్లు, పన్ను ప్రయోజనాల వంటివి వారికి మరింత మద్దతుగా నిలుస్తున్నాయి. వీటితోపాటు అసలు ఏయే అంశాలు భారతీయ రియల్ మార్కెట్లో ఎన్నారైల పెట్టుబడులు పెరగడానికి దోహదం చేస్తున్నాయో చూద్దామా?

అధిక సంభావ్య రాబడులు..

భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ చరిత్రాత్మకంగా పెట్టుబడిపై లాభదాయకమైన రాబడి అందిస్తోంది. దీర్ఘకాలిక లాభాలను కోరుకునేవారికి ఇది తప్పనిసరి ఎంపికగా మారింది.

అనుకూలమైన మారకపు రేట్లు..

గల్ఫ్ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ క్షీణించడం ఎన్నారైలకు లాభదాయకంగా మారింది. ఫలితంగా వారి కొనుగోలు శక్తి పెరగడంతో భారతీయ రియల్ ఎస్టేట్ వారికి మరింతగా అందుబాటులోకి వచ్చినట్టయింది. పైగా వారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వాటి ద్వారా వచ్చే రాబడి బాగా పెరుగుతుంది.

పన్ను ప్రయోజనాలు..

ఎన్నారైలు తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల మొత్తం పెంచుకోవడం ద్వారా మూలధన లాభాల పన్ను, వారసత్వ పన్ను నుంచి మినహాయింపులతోపాటు వివిధ పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

అద్దె ఆదాయం..

అద్దె ప్రాపర్టీలలో పెట్టుబడి అనేది నిష్క్రియ ఆదాయానికి స్థిరమైన విలువను జోడిస్తుంది. ఇది ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా, రక్షణగా పనిచేస్తుంది. అలాగే రాబడి పెంచుతుంది.

భారత్ తో బలమైన సంబంధాలు..

భారత్ లో తగిన ఆస్తులు కలిగి ఉన్న ఎన్నారైలకు స్వదేశంతో బలమైన భావోద్వేగ సంబంధాలు కొనసాగడానికి కారణమవుతాయి.

రెండో ఇల్లు..

కుటుంబ సందర్శనలు, వెకేషన్లు లేదా పదవీ విరమణ తర్వాత సౌకర్యవంతమైన జీవితం కోసం రెండో ఇల్లు అనేది ఇప్పుడు ట్రెండింగ్ అయింది.

వైవిధ్యం..

ఎన్నారైల పెట్టుబడి పోర్టు ఫోలియోకు రియల్ ఎస్టేట్ అనేది ఓ వైవిధ్యతను తీసుకొస్తుంది. నష్టాలను తగ్గించడంతోపాటు మొత్తం రాబడిని సంభావ్యంగా మారుస్తుంది.

అభివృద్ధి చెందుతున్న మార్కెట్..

అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ, పట్టణీకరణ, వివిధ రంగాలు, ప్రదేశాల్లో ఉత్తేజకమైన పెట్టుబడి అవకాశాలను రియిల్ ఎస్టేట్ రంగం అందిస్తోంది.

ప్రభుత్వ కార్యక్రమాలు..

ఎన్నారైల కోసం ముఖ్యంగా గల్స్ ప్రాంతంలో ఉండే ప్రవాసుల ప్రాపర్టీ కొనుగోళ్లను సరళీకృతం చేయడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నారైలు తమ ఆస్తికి సంబంధఇంచి మొత్తం అమ్మకపు ఆదాయాన్ని స్వదేశానికి పంపించవచ్చు. తద్వారా వారు పెట్టుబడి పెట్టిన నిధులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఎన్నారైల కోసం డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఎన్నారై స్టేటస్ కొనసాగించడానికి ఆర్థిక సంవత్సరంలో కనీస బసను 182 రోజుల నుంచి 120 రోజులకు తగ్గించింది. ఇలా ఎన్నో అనువైన విధానాలు, ఆకర్షణీయమైన రాబడి ప్రయోజనాలు కలిగి ఉండటంతో ఎన్నారైలు భారత రియల్ ఎస్టట్ లో పెట్టుబడులు పెడుతున్నారు.

This website uses cookies.