Categories: TOP STORIES

ఏసీసీ ఇండియాకు రూ.320 కోట్ల కాంట్రాక్ట్

గురుగ్రామ్ లోని ట్విన్ టవర్స్ డీఎక్స్ పీ నిర్మాణం కోసం ఇచ్చిన సిగ్లేచర్ గ్లోబల్

ఉత్తర భారతదేశంలోని రియల్టీ ప్రాజెక్టులపై దృష్టి సారించిన సిగ్నేచర్ గ్లోబల్ సంస్థ.. గురుగ్రామ్ లోని సెక్టార్ 84లో చేపట్టిన గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఏసీసీ ఇండియాకు అప్పగించింది. ఈ ప్రాజెక్టులోని అన్ని టవర్లు, బేస్ మెంట్లు, ఇతర అనుబంధ భవనాల సివిల్, స్టక్చరల్, ఎంఈపీలోని కొంత భాగం పనులకు సంబంధించి రూ.320 కోట్ల విలువైన కాంట్రాక్టును ఆ కంపెనీకి ఇచ్చింది. పనులు ప్రారంభించిన తేదీ నుంచి 27 నెలల్లోగా వాటిని పూర్తి చేయాలని, అప్పగింతకు అదనంగా మరో మూడు నెలల సమయం ఇస్తున్నట్టు ఒప్పందంలో పేర్కొంది. ఈ పనులకు సంబంధించి ఒప్పందం జరిగిన సందర్భంగా సిగ్నేచర్ గ్లోబల్ వైస్ చైర్మన్ లలిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. తాము చేస్తున్న అత్యుత్తమ ప్రాజెక్టుల్లో ఇది ఒకటని, తమ పోర్ట్ ఫోలియోకు ఇది మకుటాయమానంగా ఉంటుందని పేర్కొన్నారు.

నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన నిర్మాణంతో దీనిని రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో ఇదే ఎత్తైనదని స్పష్టంచేశారు. 2014లో తమ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులు అభివృద్ధి చేయడంతోపాటు 30వేల మందికి పైగా సంతోషకరమన కస్టమర్లను కలిగి ఉన్నామని పేర్కొన్నారు. సిగ్నేచర్ గ్లోబల్ తో అనుసంధానం కావడం విశేషమైన అంశమని, నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏసీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అని రే తెలిపారు. ముంబైలోని లోధా డెవలపర్స్ వరల్డ్ వన్ (84 అంతస్తులు, 285 మీటర్లు) వంటి ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుతో ఏసీసీకి అనుబంధం ఉందని చెప్పారు.

This website uses cookies.