Categories: LATEST UPDATES

సౌదీ సంస్థ‌ల‌తో యాక్సెస్  టఫ్ డోర్స్ ఒప్పందం

  • జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణకు అవకాశం
  • రూ. 500 కోట్ల వ్యాపారాన్ని సాధించాలన్న లక్ష్యం

స్టీలు తలుపులు, కిటికీల ఉత్పత్తిలో పేరొందిన సంస్థ అయిన యాక్సెస్ టఫ్ డోర్స్.. సౌదీ అరేబియాకు చెందిన ఆల్ఫా గ్రూప్, అల్ మనార్ గ్రూపులతో చేతులు కలిపింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరించాలన్న యాక్సెస్ టఫ్ డోర్స్ సంస్థ ప్రణాళికలను సాధించడంలో ఇదో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. భారతదేశంలో తలుపులు, కిటికీల వ్యాపారం దాదాపు రూ. 10 వేల కోట్ల వరకు పెరిగేందుకు అవ‌కాశ‌ముంది. రాబోయే ఐదేళ్లలో కనీసం 5%.. అంటే రూ. 500 కోట్ల మేర వ్యాపార షేరును పొందాలని యాక్సెస్ టఫ్ డోర్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

“ఆల్ఫా గ్రూపు, అల్ మనార్ గ్రూపులతో ఒప్పందం గురించి మేమెంతో ఉద్వేగంగా ఉన్నాం. ఈ భాగస్వామ్యం వల్ల వాళ్ల నైపుణ్యం, వనరుల ఆధారంగా మా వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించి, మా వృద్ధి లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది” అని యాక్సెస్ టఫ్ డోర్స్ సీఈఓ షారఖ్ అబ్దుల్ తెలిపారు.
“యాక్సెస్ టఫ్ డోర్స్ కు మంచి భవిష్యత్తు ఉంది, ఈ భాగస్వామ్యం విజయవంతం అవుతుందన్న విశ్వాసం మాకుంది” అని ఆల్ఫా మిడిల్ ఈస్ట్ గ్రూప్ సీఈవో నాజం అన్నారు. సౌదీ అరేబియా యువరాజు ప్రిన్స్ మొహమ్మద్ తరఫున ఆయన మాట్లాడారు.

తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి యాక్సెస్ టఫ్ డోర్స్ మార్చి 15న కొత్త షోరూంను ప్రారంభిస్తోంది. ఈ షోరూంలో కంపెనీకి ఉన్న విస్తృత రేంజి స్టీలు తలుపులు, కిటికీలు, ఫైర్ రేటెడ్ తలుపులు, సెక్యూరిటీ తలుపులు, ఎకోస్టిక్ తలుపులు.. ఇలా అన్నీ ఉంటాయి. “మా కొత్త షోరూం విషయాన్ని ప్రకటిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఇది మా వినియోగదారులకు అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించాలన్న మా నిబద్ధతను, అద్భుతమైన కస్టమర్ సర్వీసును ప్రతిబింబిస్తుంది” అని యాక్సెస్ గ్రూపు ఛైర్మన్ రఫీ ముహమ్మద్ చెప్పారు.

కొత్త షోరూం చిరునామా: ప్లాట్ నెం. 8, 9, ఐడీఏ కూకట్పల్లి, గాంధీనగర్, బాలానగర్, హైదరాబాద్. ఇది సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది.

 

This website uses cookies.