– రియల్ ఎస్టేట్ గురుతో నటుడు అలీ రెజా
రికార్డు స్థాయిలో తక్కువ గృహ రుణాల వడ్డీ రేట్లు.. గతంలో ఎన్నడూ లేనంత స్థిరంగా రియల్ ఎస్టేట్ ధరలు.. ఈ నేపథ్యంలో ఊపందుకున్న గృహ కొనుగోళ్లు.. వెరసి నగరాల్లో రియల్ ప్రభంజనం మోగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ నటుడు ఇటీవల 2బీహెచ్ కే ఫ్లాట్ కొనుగోలు చేశారు. తాను కావాలనుకున్న కలల సౌథం కోసం ఆయన ఏ చిన్న అంశాన్నీ వదిలిపెట్టలేదు. ఇంతకీ ఆయన తన కలల సౌథాన్ని స్వయంగా నిర్మించుకోలేదు. కానీ కొనుగోలు చేసిన ఆ ఫ్లాట్ ని తనకు అనుగుణంగా మలుచుకున్నారు. తన ఇల్లు ఎప్పుడూ సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉండాలని పేర్కొన్నారు. ఆయనే నటుడు అలీ రెజా. తన కలల ఇల్లు ఎలా ఉండాలి అని అనుకున్నారు? సొంతింటిపై తన అభిప్రాయాలు ఏమిటి వంటి పలు విషయాల్లో ఆయన రియల్ ఎస్టేట్ గురుతో పంచుకున్నారు.
ఆకర్షణీయమైన ఇంటీరియర్ కోసం చాలా విలాసవంతమైన అలంకరణలు తన ఆసక్తిని మరింతగా పెంచినట్టు తెలిపారు. అదే సమయంలో అవన్నీ గందరగోళపరిచే విధంగా ఉండటాన్ని ఎంతమాత్రం అంగీకరించనని చెప్పారు. పెళ్లయిన తర్వాతే తన జీవనశైలిని మరింత విస్తరించాలని భావించినట్టు అలీ వెల్లడించారు. తద్వారా తాను కలలో ఊహించిన విధంగానే ఉండాలని కోరుకున్నట్టు వివరించారు. ‘ఈ విషయంలో నా ఆలోచనలు, మా అమ్మ ఆలోచనలు ఒకేలా ఉంటాయి. తన ఇల్లు ఎక్కడ ఉండాలనే విషయంలో ఆమె చాలా దృఢంగా ఉంటుంది. నాకు కూడా ఇది మేరా ఘర్, మేరా రాజ్ అనిపిస్తుంది. నేను నా బడ్జెట్ లోనే కోరుకున్న 2బీహెచ్ కే సొంతం చేసుకున్నాను. నేను కొంతకాలం దుబాయ్ లో ఉండటం వల్ల అక్కడ నుంచి కొంచెం ప్రేరణ పొంది ఉండొచ్చని మీరు చెప్పొచ్చు. నేను మూడేళ్లపాటు దుబాయ్ డిస్కవరీ గార్డెన్స్ లో ఉన్నాను. ఇక దుబాయ్ ఇంటీరియర్స్ అనేది వేరే విషయం. వాళ్లు కేవలం సంప్రదాయ పద్ధతుల్లోనే వెళ్లరు. ఇక నేను కూడా జాతిపరమైన ఇంటీరియర్స్ కి దూరంగా ఉంటాను. ఎందుకంటే అది నా విధానం కాదు’ అని అలీ పేర్కొన్నారు.
ఆకర్షణీయంగా కనిపించేందుకు..
అలీ రెజా తన విలాసవంతమైన ఫ్లాట్ లో ఇంటీరియర్ ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసేందుకు చాలా కష్టపడ్డారు. ఇందుకోసం ఓ ఇంటీరియర్ డెకరేటర్ ని కూడా నియమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఓ ఇంగ్లిష్ ఇంటిని రూపొందించారు. ‘ఇప్పటికే నేను నా కలల గృహంలో నివసిస్తున్నాను. నేనెలా ఉండాలని కోరుకున్నానో అలానే ఉంటున్నాను. నేను జీవితంలో మరింత వెచ్చించగలను అనిపించిప్పుడు సహజంగానే నా కోరికల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. నేనెప్పుడూ ఉత్తమమైనదాని కోసమే ఆలోచిస్తాను. ఇక శుభ్రత విషయంలో నేను చాలా వింతగా వ్యవహరిస్తాను. ఈ అలవాటు వల్ల నా భార్య చిరాకుపడుతుంది. మా బెడ్ రూంలో ప్రతి వస్తువూ సరిగా ఉండాలని కోరుకుంటాను’ అని వివరించారు. ఈ సందర్భంగా తన మొట్టమొదటి ఇంటికి సంబంధించిన విషయాలను అలీ రెజా పంచుకున్నారు. తాము పెంట్ హౌస్ కి మారినప్పుడు ఆ అంతస్తు మొత్తం తమకు ఎలా ఉండేదో వివరించారు. ‘మొదట్లో మేం ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. అనంతరం బయటకు వెళ్లవలసిన సమయం వచ్చింది. మా నాన్న ఒక పెంట్ హౌస్ కొన్నారు. ఆ అంతస్తు మొత్తం మాకే ఉండేది. పైగా చాలా విశాలంగా ఉండేది. నేను ఎనిమిదేళ్ల వయసు నుంచి అక్కడే పెరిగాను. పెంట్ హౌస్ అపార్ట్ మెంట్ లో ఉండేది. కానీ కూర్చోడానికి మాకు సొంత లాన్ ఉండేది. అది నాకు వ్యక్తిగతమైన స్థలంగా అనిపించేది. నేను పెరిగిన పెంట్ హౌస్ గొప్పతనం అది. ఇక మా నాన్న ఆ పెంట్ హౌస్ మరింత విస్తరించాలని అనుకోవడంతో మేం మరో అద్దె ఇంటికి వెళ్లాం. అయితే, బిల్డర్ తో కొన్ని సమస్యల వల్ల అది చాలా సమయం తీసుకుంటోంది’ అని అలీ రెజా వెల్లడించారు.
అమ్మ తోట..
ప్రపంచంలో ఎక్కడ ఇంటి నిర్మాణం జరిగినా తన తల్లి కళాకారిణిగా మారుతుందని అలీ తెలిపారు. ఆమెకు తోటలంటే చాలా ఇష్టం అని, అందుకే తమ కోసం ఓ తోట ఏర్పాటు చేసిందని చెప్పారు. ‘మీరు మా అమ్మకు రూ.లక్ష ఇవ్వండి. ఇంటి అలంకరణ కోసం ఆ మొత్తం అంతా ఖర్చు చేస్తుంది. ఇది ఒకరకంగా ఆమెకు ఒత్తిడి తగ్గిస్తుంది.. చిన్నచిన్న తోటలను రూపొందించడంలో ఆమె ప్రసిద్ధి. నా స్నేహితుల్లో చాలామంది ఈ విషయంలో ఆమె ప్రతిభను వినియోగించుకోవాలని అనకున్నారు. ఆమె చేసే పనిని వ్యాపారంగా విస్తరించాలనే ఆలోచనలతో పెట్టుబడి పెట్టాలని ఆతృతగా ఎదురుచూశారు. కానీ వారి ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించడం ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం’ అని చెప్పారు. ఎలాంటి ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారని అలీ రెజాను అడగ్గా.. విల్లా లేదా బంగ్లాలో ఉండటానికి ఎవరికి ఆసక్తిగా ఉండదని ప్రశ్నించారు. అయితే, తనకు ఉన్న కొన్ని వ్యక్తిగత కారణాలరీత్యా వాటిని ఎంచుకోలేదని వివరించారు. ‘బంగ్లా ఉంటే, దాని నిర్వహణ కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాకు ఒక బంగ్లా ఉండాలనుకుంటే అది చాలా పెద్దగా ఉండాలి. అలాగే అవి రెండు కంటే ఎక్కువుండాలి. దీంతో దాని ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది. నా సొంతంగా అదంతా భరించేంత వరకు అందులో ఒక్కటి కూడా కోరుకునే ఉద్దేశం నాకు లేదు. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను. ఇక బంగ్లా ఉంటే దానిని చూసుకోవడానికి సేవకులు కావాలి. ఎందుకంటే నా భార్యపై ఎలాంటి భారం వేయడం నాకు ఇష్టం ఉండదు.