Categories: Celebrity Homes

అంకిత గృహం.. అంతా తెలుపుమయం

తెల్లని గోడలు ఎప్పటికీ విసుగు పుట్టించవు. ఈ సూత్రం నటి అంకితా లోఖండేకు బాగా తెలుసు. అందుకే ఆమె ఇంటి తెల్లని గోడలు చాలా శుభ్రంగా, క్లాసిక్ గా కనిపిస్తాయి. కొంచెం బోహో, మినిమలిస్ట్ కలయికతో పూర్తిగా తెల్లటి గోడలు ఆహా అనిపించేలా ఉన్నాయి. అంకితతోపాటు ఆమె భర్త విక్కీ జైన్ కూడా మినిమలిస్టులే. ఇద్దరూ కూడా ప్రతి గదిలోనూ తెల్ల రంగునే కోరుకున్నారు. నిజానికి వైట్ డెకర్ ఎలా ఉన్నా చాలా అందంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఇంటి గురించి అంకితా బోలెడు సంగతులు చెప్పారు.

‘నా పెళ్లి అయిన తర్వాత కొత్త ఇంటి గురించి కలలు కన్నాను. ఆ ఇంట్లో ఇద్దరం కలిసి మా జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాను. అందువల్ల అది పరిపూర్ణంగా ఉండాలి. మా జంటకు అది ప్రతిబింబం కావాలి. మా వ్యక్తిత్వాల వలె ప్రకాశవంతంగా ప్రకాశించే అంశాలను అందులో కచ్చితంగా పొందుపరుస్తాను. నేను వేటినీ గుడ్డిగా చూడను.. అన్నింట్లో నా వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తాను’ అని తెలిపారు. 8 బీహెచ్ కే ఇంటిని విశాలమైన గదులతో 5 బీహెచ్ కే ఇంటిగా మార్చారు. ఇద్దరూ కలిసి తమ ఇంటికి స్వీట్ హోమ్, వైట్ హౌస్ అని పేరు కూడా పెట్టారు.

‘ఇంటీరియర్లు ప్రతి మూలలలో తెలుపు రంగువి మాత్రమే ఉంటాయి. గోడల నుంచి కళాఖండాల వరకు.. ఉపకరణాల నుంచి అలంకారాల వరకు మా ఇంట్లో ప్రతిదీ స్వచ్ఛమైన తెల్ల రంగులో ఉంటాయి. మేం ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు దీనిని 19వ అంతస్తులో చూశాం. అంతేకాకుండా అది ‘ఏ’ వింగ్ లో ఉంది. దీంతో మాకు ఓ బంధం ఏర్పడింది. ఏ ఫర్ అంకిత.. ఇంకా 19వ తేదీ నా పుట్టినరోజు. నిజానికి ఇది మా ఆయన ఆలోచన. వెంటనే ఈ ఇంటి కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నాం’ అని అంకిత వివరించారు.

అంకిత కొత్త ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె ఇంట్లో ఓ గది నుంచి మరో గదిలోకి నడిస్తే అలసిపోతానని చెప్పారు. దీనివల్ల తాను కొంత బరువు పెరిగానని వ్యాఖ్యానించారు. ‘అత్యాధునిక పరికరాలు, సౌకర్యాలతో కూడిన మా ఇల్లు ముంబై స్కైలైన్ ను అద్భుతంగా ఆవిష్కృతం చేస్తుంది. హైరైజ్ భవనంలో ఉన్న మా ఫ్లాట్ లో వుడెన్ ఫ్లోరింగ్, పెద్ద డెక్, ఎల్ ఈడీ దీపాలతో సిట్టింగ ఏరియా వంటివి ఉన్నాయి. ఇక తెల్లటి కుషన్ తో కూడిన గుండ్రని సోఫా.. దానికి సరిపోయే తెల్లడి మార్బుల్ ఫ్లోరింగ్ తో కూడిన తెల్లటి రంగు లివింగ్ రూమ్ నాకు చాలా ఇష్టం’ అని తెలిపారు. ఆ గదిలో ఫ్రెంచ్ థీమ్ అద్దాల గోడ, షీర్ కర్టెన్లు ఉన్నాయి. ఇవే కాదు.. ఇలాంటి ఎన్నో అందమైన ఆధునిక అందాలు చాలా ఉన్నాయి.

This website uses cookies.