Categories: TOP STORIES

అఫ‌ర్డబుల్ ల‌గ్జ‌రీ ప్రాజెక్ట్స్‌

రాధే స్కై @ కొల్లూరు- వెలిమ‌ల‌

2025లో హైద‌రాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని భావించేవారికి.. రెజ్‌టీవీ స‌జెస్ట్ చేస్తున్న రెరా అనుమ‌తి ప్రాజెక్టే.. స్కై ప్రాజెక్ట్ ఎట్ కొల్లూరు. ఎకానమీ ప్రైస్‌కే లగ్జరీ ఫెసిలిటీస్‌తో అపార్ట్‌మెంట్స్ కావాల‌ని కోరుకునేవారికి చ‌క్క‌టి ఆప్ష‌న్‌.. స్కై. రాధే కన్‌స్ట్రక్షన్స్ అనుబంధ సంస్థ అయిన క్లౌడ్స్‌వుడ్‌ కన్‌స్ట్రక్షన్స్ ఈ ప్రాజెక్టును డెవ‌ల‌ప్ చేస్తోంది. ఇందులో మొత్తం ఏడు బ్లాక్‌లు ఉండగా.. 1325 ఎస్ఎఫ్‌టీ నుంచి 2610 చదరపు అడుగుల్లో టూ బీహెచ్‌కే, త్రీ బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్‌గా ఉండే క్లబ్‌హౌస్‌, ఇండోర్‌, ఔట్‌డోర్ ఎమినిటీస్‌తో పాటు స్టిల్ట్‌ ఎమెనిటీస్‌ ఉండటం ఈ కమ్యూనిటీ ప్రత్యేకత.

ముప్పా మెలోడి@ తెల్లాపూర్


అవసరానికి సిటీకి దగ్గర్లో ఉండాలి..! అదే సమయంలో ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులకు దూరంగా హాయిగా ఊపిరి పీల్చుకుంటూ జీవించాలనుకునే వారికి ముప్పా మెలోడీ బెస్ట్‌ ఛాయిస్‌ అంటోంది కంపెనీ. మొత్తం 8.33 ఎకరాల్లో విస్తరించి ఉన్న ముప్పా మెలోడీలో 7 బ్లాక్‌లు.. ఒక్కో బ్లాక్‌లో 17 ఫ్లోర్స్‌ నిర్మించారు. 1010 నుంచి 1725 స్క్వేర్‌ఫీట్స్‌ రేంజ్‌లో టూ బీహెచ్‌కే, 2, 2.5, 3 బీహెచ్‌కే హోమ్స్‌ అందుబాటులో ఉన్నాయ్‌. 1054 కొత్త ఫ్లాట్స్‌ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది ముప్పా ప్రాజెక్ట్స్. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో షీర్ వాల్‌ టెక్నాలజీని వినియోగించారు. అలాగే 75 శాతం ఓపెన్‌ స్పేస్‌, రెండు క్లబ్‌ హౌస్‌లు, ఇండోర్‌ అండ్ ఔట్ డోర్‌ గేమ్స్‌, బ్యాంకెట్‌ హాల్‌, జాగింగ్‌-సైక్లింగ్‌ ట్రాక్‌ లాంటి అమెనిటీస్‌ ఉన్నాయ్‌. మోడ్రన్‌ ఫెసిలిటీస్‌కి టెక్నాలజీ యాడ్‌ చేసి తమ కస్టమర్లకి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తామంటున్నారు. అన్నిరకాల చట్టబద్ధ అనుమతులతో నిర్మించారు ఈ ప్రాజెక్ట్‌ని. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్‌తో హెచ్ఎండీఏ అప్రూవల్‌ కూడా పొందిన మెలోడీ ప్రాజెక్ట్‌కి టీఎస్‌ రెరా P01100002646 రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కేటాయించింది. పదికి పైగా ప్రభుత్వ- ప్రైవేట్‌ సెక్టార్‌లోని మేజర్‌ బ్యాంక్‌ల నుంచి హోమ్‌లోన్‌ పొందే సదుపాయం కూడా ఉంది.

జీహెచ్ఆర్ క‌లిస్టో @ కొల్లూరు

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో రెండు ద‌శాబ్దాల‌కు పైగా అనుభ‌వం జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా.. కొల్లూరులో 8.3 ఎక‌రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టే.. జీహెచ్ఆర్ క‌లిస్టో. ఇందులో 4 ట‌వ‌ర్ల‌లో 11 బ్లాకుల్ని నిర్మిస్తున్నారు. ఒక్కో బ్లాకును 18 అంతస్తుల ఎత్తులో డెవ‌ల‌ప్ చేస్తున్నారు. జీహెచ్ఆర్‌ క‌లిస్టో ప్రాజెక్టులో వ‌చ్చేవి 1190 ఫ్లాట్లు. ఫ్లాట్ల‌ను సుమారు 1195 నుంచి 1915 చ‌ద‌ర‌పు అడుగుల్లో క‌డుతున్నారు. 3300 చదరపు అడుగుల నుంచి 3385 చదరపు అడుగుల్లో స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. దాదాపు 50 వేల చదరపు అడుగుల్లో క్ల‌బ్ హౌజ్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ తో పాటు ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ వంటివి పొందుప‌రిచారు.

This website uses cookies.