poulomi avante poulomi avante

ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం డీపీఆర్ కు ఏజెన్సీ ఖరారు

రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం డీపీఆర్ కు టెండర్ ఖరారైంది. ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ డీపీఆర్ కోసం మొత్తం ఐదు సంస్థలు దాఖ‌లు చేశాయి. ఇందులో షీలాదిన్ అసోసియేట్, సీనెక్, ఎస్ఏ ఇన్ ఫ్రా, ఎల్ యూ అసోసియేట్, ఆర్ వీ అసోసియేట్ లు ఉన్నాయి. తక్కువకు కోట్ చేసిన కంపెనీని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్ అండ్ బీ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కోసం సచివాలయానికి పంపించారు. సీఎం ఆమోద ముద్ర వేయగానే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం డీపీఆర్ టెండర్ దక్కించుకున్న కన్సల్టెంట్ ఏజెన్సీ వివరాలు వెల్ల‌డిస్తారు. టెండర్ దక్కించుకున్న కన్సల్టెన్సీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం డీపీఆర్ కోసం అంతకు ముందు ఆర్ అండ్ బీ అధికారులు టెండర్లు పిలవగా సరైన స్పందన రాకపోవడంతో రెండోసారి టెండర్లను పిలిచారు. ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో లేఖ రాసింది. ఈ రహదారి మంజూరైనప్పుడు ఖరారైన అలైన్‌‌మెంట్‌‌ ప్రకారం చౌటుప్పల్‌‌-ఆమనగల్‌‌-సంగారెడ్డి వరకు 189 కిలో మీటర్లుగా నిర్ధారించారు. ఆ త‌ర్వాత‌ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఆలోచనతో ప్రైమరీ అలైన్‌‌ మెంట్‌‌లో మార్పులు చేసింది. దీంతో మరో 11 కిలోమీటర్లు పెరిగి రోడ్డు మొత్తం 200 కిలోమీటర్లకు చేరింది. ఈ మొత్తానికి డీపీఆర్‌‌ ఇవ్వాలంటూ టెండర్‌‌ నోటీసులోనూ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ డీపీఆర్ రెడీ చేయాలని టెండర్ దక్కించుకున్న కంపెనీకి స్పష్టం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

మార్చి రెండో వారంలో రీజినల్ రింంగ్ రోడ్డు దక్షిణ భాగానికి సంబందించిన డీపీఆర్ టెండర్ కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆరు నెలల్లో అంటే.. సెప్టెంబర్ నాటికి సదరు సంస్థ ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ డీపీఆర్ సిద్దం చేసి.. రేవంత్ సర్కార్ కు అందించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌ మెంట్‌ దగ్గర‌ నుంచి రోడ్డు నిర్మాణ విధానం సహా పలు అంశాలు సమగ్ర ప్రాజెక్టు నివేదికలో తేలనున్నాయి. రహదారి నిర్మాణం, మార్గమధ్యలో నిర్మించే వెహికల్‌ అండర్‌ పాస్‌, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, క్రాసింగ్‌, జంక్షన్‌లు, ఎక్కడెక్కడ టోల్‌ ప్లాజాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందనేది తెలియనుంది. ఆ మార్గంలో ఏమైనా గ్రామాలు, ఆవాసాలు ఉన్నాయా? ఉంటే అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు? చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయి? సాగు, అటవీ భూములు తదితర వివరాలను సేకరిస్తారు.

రోడ్డు నిర్మాణానికి సేకరిస్తున్న భూముల వివరాలతో పాటు నిర్మాణ వ్యయ అంచనాలు కూడా సమగ్ర ప్రాజెక్టు నివేదికలో తెలుస్తాయి. దీంతో పాటు ఈ రహదారిని ఏ పద్ధతిలో నిర్మించాలి.. ఏ విధానంలో నిర్మిస్తే లాభదాయకంగా ఉంటుందన్న అంచనాలు కూడా తెలుస్తాయి. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించనుందా, లేదంటే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మాణం చేపట్టనుందా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేంద్రం నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్లను తెరిచేందుకు మరో వారం రోజుల సమయం ప‌డుతుంద‌ని అధికారులు అంటున్నారు. ట్రిపుల్ ఆర్ రెండు భాగాలను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles