ఈ ఏడాది 5.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక
దేశీయ రియల్ మార్కెట్ పరుగులు పెట్టనుంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ మార్కెట్ దూకుడుగా వెళ్లనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం జరగనుందని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. 2022లో 4,02,000 ఇళ్ల నిర్మాణం జరగాల్సి ఉండగా.. ఈ ఏడాది అది 5,57,900కి పెరిగిందని పేర్కొంది. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఏడు ప్రధాన నగరాల్లో 5.6 లక్షల యూనిట్లను పూర్తి చేసి కొనుగోలుదారులకు స్వాధీనం చేయాల్సి ఉందని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికం కావడం గమనార్హం. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 23,800 ఇళ్లు కట్టాల్సి ఉంది. గతేడాది ఇది 11,700గా ఉంది. ఈ ఏడాది ఇళ్ల డెలివరీలో ఢిల్లీయే ముందుంది. అక్కడ 1,70,100 ఇళ్లు కట్టి డెలివరీ చేయాల్సి ఉండగా.. తర్వాత 1,31,400 యూనిట్లతో ముంబై రెండో స్థానంలో ఉంది.
This website uses cookies.