Categories: PROJECT ANALYSIS

మణికొండలో యాంబియెన్స్ కోర్టు యార్డ్

కచ్చితమైన ఇల్లంటే ఏంటి? మనకు అనువైన లొకేషన్.. చుట్టూ చక్కని గ్రీనరీ.. రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన వసతులు అందుబాటులో ఉండటం.. ఇంతే కదా? వీటికి తోడు ప్రీమియం సౌకర్యాలు కూడ తోడైతే.. అదిరిపోతుంది కదూ? మరి అలాంటి ప్రాజెక్టే మణికొండలో రూపుదిద్దుకుంటోంది. అదే.. యాంబియెన్స్ కోర్టు యార్డ్. 2, 3 బీహెచ్ కే ఫ్లాట్లు కలిగిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్ మెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ధర కూడా రూ.90 లక్షల నుంచి మొదలు కావడం.. చక్కని ప్రైమ్ లొకేషన్ లో ఉండటంతో ఈ ప్రాజెక్టుకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

మణికొండ నుంచి నగరంలోని ఏ ప్రదేశానికైనా మంచి కనెక్టవిటీ ఉంది. ప్రముఖ ఐటీ హబ్ లకు కూడా ఇది చాలా దగ్గరగా ఉండటం మరో ఆకర్షణ. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి, ప్రాజెక్టు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందించే విశాలమైన గ్రీనరీ కూడా ఉంది. అటు వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా, అదే సమయంలో భద్రత విషయంలో రాజీలేకుండా చూసేందుకు 24 గంటల సెక్యూటరిటీ ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ నుంచి షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్, ఏటీఎంలు, గ్రాసరీ స్టోర్లు, ఫార్మసీ వంటి 30 రకాలకు పైగా వసతులు, సౌకర్యాలు చాలా దగ్గర్లో అందుబాటు ఉన్నాయి. మీ వర్క్ ఫ్రం హోం విధానానికి కాస్త గ్రీనరీ టచ్ ఇచ్చి.. ఆరుబయట విశాలమైన పచ్చికబయలు నుంచి పనిచేసే వీలు కూడా ఉంది.

మొత్తం ప్రాజెక్టులో 67 శాతం ఓపెన్ ఏరియానే ఉంది. పూర్తి పచ్చదనంతో నిండిన ఈ ఓపెన్ ఏరియాలో జాగింగ్ లేదా వాకింగ్ లేదా యోగా చేస్తే రోజంతా ఎంతో శక్తివంతంగా ఉంటారనడంలో సందేహం లేదు. సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ తోపాటు ఔట్ డోర్ జిమ్, యోగా అండ్ మెడిటేషన్ పెవిలియన్, ఏంఫిథియేటర్, స్కేటింగ్ రింక్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, క్రికెట్ పిచ్, పార్టీ లాన్స్, చిన్నపిల్లల ప్లే ఏరియా వంటి ఎన్నో వసతులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రీమియం క్వాలిటీ ఇళ్లను నిర్మించే పేరు కలిగిన కాన్సెప్ట్ యాంబియెన్స్, సుఖీ గ్రూప్ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మణికొండలోని యాంబియెన్స్ కోర్డు యార్డుకు వెళ్లి ఓ లుక్కేయండి.

This website uses cookies.