Categories: PROJECT ANALYSIS

రాంకీ హార్మొనీ ఫేజ్-1కి ఓసీ వచ్చేసింది!

ప్రగతినగర్ లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు

జీఎస్టీ లేకుండా ఫ్లాట్ కొని వెంటనే గృహప్రవేశం

నాణ్యమైన నిర్మాణాలను సకాలంలో డెలివరీ చేయడంలో నిబద్ధత కనబరిచే ప్రముఖ డెవలపర్ రామ్ కీ ఎస్టేట్స్ కు చెందిన ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు.. రామ్ కీ వన్ హార్మొనీ ఫేజ్-1కి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చేసింది. కూకట్ పల్ిర ప్రగతి నగర్లోని ప్రైమ్ రెసిడెన్షియల్ హబ్ నడిబొడ్డులో 8.1 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామ్ కీ వన్ హార్మొనీ.. ఈ ప్రాంతంలోని మొదటి గేటెడ్ కమ్యూనిటీ. ఇది అందులోని నివాసితులకు అద్భుతమైన కనెక్టివిటీతోపాటు అధునాతన జీవనశైలి అనుభవాన్ని అందిస్తుంది.

ఇళ్ల కొనుగోలుదారులు ఇప్పుడు ఎలాంటి జీఎస్టీ చెల్లించకుండానే తమ కలల సౌథాన్ని కొనుగోలు చేయడమే కాకుండా వెంటనే గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో మొత్తం ఏడు టవర్లలో 803 విలాసవంతమైన యూనిట్లు ఉన్నాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా 2, 2.5, 3, 3.5 బీహెచ్ కే యూనిట్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. ఈ ఫ్లాట్లన్నీ ఆధునిక కుటుంబ అవసరాలు తీర్చేలా డిజైన్ చేశారు. ‘రామ్ కీ వన్ హార్మొనీ ఫేజ్-1కి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అందుకున్నందుకు సంతోషంగా ఉందని రామ్ కీ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నంద కిషోర్ పేర్కొన్నారు. తమ కొనుగోలుదారులకు సకాలంలో ఉన్నతమైన నివాస స్థలాలను అందించడంలో తమ అంకితభావానికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఫేజ్-2 ఓసీ కూడా త్వరలోనే అందుకుని, ఆ ఫ్లాట్లను కూడా తమ కొనుగోలుదారులకు అప్పగించడానికి చూస్తున్నామని చెప్పారు.

రామ్ కీ వన్ హార్మొనీ.. కూకట్ పల్లి ప్రగతి నగర్లోని వ్యూహాత్మక ప్రదేశంలో అగ్రశ్రేణి విద్యాసంస్థలు, అన్నిరకాల వైద్య సదుపాయాలు, వినోద కేంద్రాల మధ్యలో ఉంది. ప్రపంచ స్థాయి క్లబ్‌హౌస్ తోపాటు పిల్లలు, పెద్దలకు అద్భుతమైన క్రీడా సౌకర్యాలను కలిగి ఉన్న ఈ ప్రాజెక్టు.. అన్ని వయసులవారినీ ఆకర్షిస్తుంది. ప్రాజెక్ట్ ఫేజ్-1, ఫేజ్-2 కోసం ప్రత్యేక క్లబ్‌హౌస్‌లు, రూఫ్-టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, జిమ్, బిజినెస్ లాంజ్, యోగా, ధ్యానం కోసం ప్రత్యేక స్థలాలను కలిగి ఉంది.

This website uses cookies.