Categories: TOP STORIES

బుద్వేల్‌లో మ‌రో సైబ‌ర్ ట‌వ‌ర్స్‌

మాదాపూర్‌లోని సైబ‌ర్ ట‌వ‌ర్స్‌తో హైద‌రాబాద్ రూపురేఖ‌లే పూర్తిగా మారిపోయాయి. జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌లు.. దేశ విదేశాల్నుంచి ఐటీ నిపుణులు న‌గ‌రంలో సేవ‌ల్ని అందిస్తున్నారు. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని బుద్వేల్‌లో సుమారు 45 ఎక‌రాల్లో మ‌రో సైబ‌ర్ ట‌వ‌ర్స్‌ను నిర్మించ‌డానికి స్థ‌లం కూడా కేటాయించింది. ఇప్పటికే, హెచ్‌ఎండీఏ ఇంటర్నేషనల్ బిడ్డింగ్‌లో డిజైన్లను ఆహ్వానించింది. ఇక్కడ 45 ఎకరాల్లో సైబర్‌ టవర్స్‌ నిర్మిస్తున్నారు. సకల హంగులతో అర్బన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ అభివృద్ధి చేయబోతున్నారు. అంతేకాదు, ఇక్కడ మరో 50 ఎకరాల్లో ఐటీ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ స్థలాలను ఐటీ కంపెనీలు, స్టార్టప్‌ కంపెనీలకు కేటాయించే అవకాశముంది. అందుకే హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది.

This website uses cookies.