రూ.105 కోట్లతో అపార్ట్ మెంట్ కొన్న జగదీశ్ మాస్టర్
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో ఖరీదైన లావాదేవీ జరిగింది. వర్లీలోని ఒబెరాయ్ 360 వెస్ట్ లో ఓ అపార్ట్ మెంట్ ను రూ.105 కోట్లకు అమ్ముడైంది. డీప్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ డైరెక్టర్ జగదీష్ మాస్టర్ ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. 7,139 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ఒబెరాయ్ 360 వెస్ట్ లోని 60వ అంతస్తులో ఉంది. అపార్ట్ మెంట్ చదరపు అడుగు ధర రూ. 1.48 లక్షలు పలికింది. ఈ కొనుగోలు కింద ఐదు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.
అలాగే స్టాంపు డ్యూటీ కింద రూ. 3.97 కోట్లు, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఒబెరాయ్ 360 వెస్ట్ అనేది ఒబెరాయ్ రియాల్టీ ద్వారా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది 4 బీహెచ్ కే, 5 బీహెచ్ కే యూనిట్లతో కూడిన రెండు టవర్ల ప్రాజెక్టు. ఇందులో డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్లు, పెంట్‌హౌస్‌లు కూడా ఉన్నాయి. కాగా, జగదీష్ మాస్టర్ భార్య ఉర్జిత జగదీష్ మాస్టర్ అదే భవనంలోని 59వ అంతస్తులో రూ.105 కోట్లతో విలాసవంతమైన అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ తారలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు.