వైజాగ్‌లో ఆరంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ప్రపంచాన్ని ఆకర్షించింది. దిగ్గజ సంస్థలు వైజాగ్‌కు క్యూ కట్టడమే ఇందుకు ప్రధాన కారణం. రిలయెన్స్ గ్రూప్, అదానీ గ్రూప్, ఆదిత్యా బిర్లా, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐవోసీఎల్, జిందాల్, మోండలీస్, పార్లీ, శ్రీసిమెంట్స్ వంటి కంపెనీలు ఏపీలోనూ తమ కార్యకలాపాల్ని విస్తరించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులు, ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్నాయి. 974 కిలోమీటర్ల తీర ప్రాంతంతో పాటు ఆరు విమానాశ్రయాలున్నాయి. వీటిలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు కావడం గమనార్హం. దేశంలో అభివృద్ధి చెందుతున్న పదకొండు పారిశ్రామిక కారిడార్లలో మూడు ఏపీలోనే ఉండటం విశేషం. వీటిలో పది పారిశ్రామిక జోన్లు ఉన్నాయి. ప్రముఖ విద్యా సంస్థలు, ల్యాండ్ బ్యాంక్, నైపుణ్యం కలిగిన యువత, పారిశ్రామిక మరియు వ్యాపార పర్యావరణ వ్యవస్థ ఉంది.
ఆంధ్రప్రదేశ్లో పోర్టులతో రహదారుల్ని బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీకి పారిశ్రామిక వృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమన్నారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడమెంతో ముఖ్యమని తెలిపారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని.. రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు రూ.20 వేల కోట్లను ఖర్చు చేస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిని పెడుతున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. పది గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఎనర్జీ డిపార్టుమెంట్‌లో రూ.8,25,639 కోట్ల పెట్టుబడుల్ని పెడుతున్నామని తెలిపారు.
This website uses cookies.