దేశంలో రిటైల్ మార్కెట్ 2032 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు.. అంటే దాదాపు రూ.164 కోట్లకు చేరుకుంటుందని రిటైల్ వర్తకుల అసోసియేషన్ (రాయ్), ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ పేర్కొన్నాయి. ఈ మేరకు సంయుక్తంగా ఓ నివేదిక విడుదల చేశాయి. 2021 నాటికి రిటైల్ మార్కెట్ పరిమాణం 690 బిలియన్ డాలర్లు (56..5 లక్షల కోట్లు)గా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. సంఘటిత రిటైల్ రంగం విక్రయాలు 2021-22 నాటికి 52 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2028 నాటికి 136 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని వివరించింది.
రాబోయే నాలుగైదు ఏళ్లలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన నగరాల్లో 25 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో కొత్త మాల్ వసతులను అభివృద్ధి చేయనున్నట్టు అంచనా వేసింది. 2022లో ఈ ఏడు పట్టణాల్లో 2.6 మిలియన్ చదరపు అడుగుల కొత్త మాల్ విస్తీర్ణం వచ్చిందని పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. సంఘటిత రిటైల్ మార్కెట్ ఏటా 25 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చూస్తుందని నివేదిక వెల్లడించింది. భారత రిటైల్ రంగం 2019
నుంచి 2022 మధ్య 1,473 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 51 మిలియన్ చదరపు అడుగులకు పైన మాల్ సౌకర్యాలు ఉండగా.. అందులో ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు 62 శాతం వాటా కలిగి ఉన్నట్టు చెప్పారు.
This website uses cookies.