poulomi avante poulomi avante

కొంపల్లిలో అపర్ణా కెనోపీ ఎల్లో బెల్స్

కొత్త స్నేహాలు, అంతులేని ఆనందం, సాటిలేని గర్వంతో కూడిన ఇంట్లో నివసించాలని ఉందా? అయితే వెంటనే కొంపల్లి సమీపంలోని గుండ్ల పోచంపల్లిలో రూపుదిద్దుకుంటున్న అపర్ణా కెనోపీ ఎల్లో బెల్స్ ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. ఎల్లో బెల్ ఫ్లవర్స్.. గర్వం, ఆనందం, విజయం, స్నేహానికి సూచికలు. ఈ సద్గుణాలన్నీ అపర్ణా కెనోపీ ఎల్లో బెల్స్ కమ్యూనిటీలో మీకు కనిపిస్తాయి.

10.5 ఎకరాల స్థలంలో అదిరిపోయే సౌకర్యాలు, కళ్లు చెదిరే డిజైన్లతో ఈ గేటెడ్ కమ్యూనిటీ సిద్ధమవుతోంది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేందుకు వీలుగా ఎక్కువ గ్రీన్ స్పేస్ ఉండేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఇక్కడ సకల సౌకర్యాలూ అందుబాటులో ఉండటం వల్ల జీవితం ఆనందమయంగా సాగిపోతుందనడంలో ఎలాంటి సంశయం అవసరం లేదు.

ఇండోర్, ఔట్ డోర్ స్పోర్ట్స్ ఏక్టివిటీస్ తోపాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, థెరపిటిక్ గార్డెన్, బార్బెక్యూ కోర్టు వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. పిల్లల ఆటస్థలం, జాగింగ్ ట్రాక్, లైబ్రరీ, సెక్యూరిటీ, మల్టీ పర్పస్ హాల్, జిమ్నాజియం, ఇంటర్నెట్, లిఫ్ట్, గ్యాస్ లైన్, పవర్ బ్యాకప్, ఏరోబిక్స్, క్రికెట్, వాషింగ్ మెషీన్ ఏరియా, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టుల వంటి పలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక లోకేషన్ పరంగా కూడా ఇది చక్కటి ప్రదేశం. కొంపల్లి చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ హబ్. నగరంలోని ఏ ప్రాంతానికైనా ఇక్కడి నుంచి మంచి కనెక్టివిటీ కూడా ఉంది.

గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ కేవలం 1.5 కిలోమీటర్ల దూరంగా ఉండగా.. ఔటర్ రింగు రోడ్డు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎన్ హెచ్-7 ఉంది. నారాయణ హృదయాలయ, ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ వంటి ప్రముఖ ఆస్పత్రులు 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పలు ఇంటర్నేషన్ స్కూల్స్, కాలేజీలు కిలోమీటరు నుంచి 12 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ప్రముఖ బ్యాంకులు, మాల్స్, వినోద కేంద్రాలు సైతం సమీపంలోనే ఉన్నాయి.

రెరా రిజిస్ట్రేషన్ కలిగిన ఈ ప్రాజెక్టులో 1294 చదరపు అడుగుల నుంచి 1911 చదరపు అడుగల మధ్యలో 2, 3 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లాట్ ధర రూ.67 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ప్రస్తుతం చదరపు అడుగు ధర రూ.4,799 ఉండగా.. ఈనెల 4వ తేదీ నుంచి రూ.150 పెరగనున్నది. మరి ఆలస్యమెందుకు? వెంటనే అపర్ణా కెనోపీ ఎల్లో బెల్స్ ప్రాజెక్టు సందర్శించి ఓ చక్కని ఫ్లాట్ బుక్ చేసుకోండి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles