Categories: TOP STORIES

న‌ల‌గండ్ల‌లో అప‌ర్ణా మ‌ల్టీప్లెక్స్‌!

ప‌శ్చిమ హైద‌రాబాద్‌లో హాట్ లొకేష‌న్ అయిన న‌ల‌గండ్ల‌లో బ‌డా ఆకాశ‌హ‌ర్మ్యాల్ని నిర్మించిన అప‌ర్ణా హౌసింగ్ ఇన్‌ఫ్రా.. తాజాగా మ‌ల్టీప్లెక్స్ నిర్మించడానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమ‌తి తీసుకుంది. సుమారు మూడు ఎక‌రాల విస్తీర్ణంలో.. జి+4 అంత‌స్తుల ఎత్తులో ఈ మ‌ల్టీప్లెక్స్ నిర్మిస్తున్న‌ది. ఇది అందుబాటులోకి వ‌స్తే.. ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్ర‌జ‌లు కొత్త సినిమాలను ఆస్వాదించ‌డానికి ప‌నిగ‌ట్టుకుని గ‌చ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్ వంటి ప్రాంతాలకు వెళ్ల‌క్క‌ర్లేదు. న‌ల‌గండ్ల‌లోనే త‌మ అభిమాన న‌టుల సినిమాల‌ను వీక్షించొచ్చు. ముఖ్యంగా, గోపన‌ప‌ల్లి, న‌ల‌గండ్ల‌, లింగంప‌ల్లి, తెల్లాపూర్‌, కొల్లూరు, ఉస్మాన్ న‌గ‌ర్‌, రామ‌చంద్రాపురం, బీహెచ్ఈఎల్‌, వ‌ట్టినాగుల‌ప‌ల్లి వంటి ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఈ మ‌ల్టీప్లెక్స్ చ‌క్క‌టి వినోదాన్ని అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌దీనాగూడ‌లో మ‌ల్టీప్లెక్స్‌

మ‌దీనాగూడ‌లో మ‌రో మ‌ల్లీప్లెక్స్ ఆరంభం కానుంది. సుమారు రెండు ఎక‌రాల్లో జి+ 6 అంత‌స్తుల ఎత్తులో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ నిర్మాణాన్ని శ్రీ తిరుమ‌లా ఇన్‌ఫ్రా అనే సంస్థ నిర్మిస్తోంది. ఇప్ప‌టికే మ‌దీనాగూడలో జీఎస్ఎం మాల్‌లో ఐనాక్స్ మ‌ల్టీప్లెక్స్ ఉన్న విషయం తెలిసిందే. దీనికి చేరువ‌లోనే ఈ కొత్త మ‌ల్టీప్లెక్స్ రానున్న‌ది. దీంతో పాటు మియాపూర్ మెయిన్ రోడ్డులో ఎస్ఎంఆర్ డెవ‌ల‌ప‌ర్స్ ఆరంభించిన మ‌ల్టీప్లెక్స్ అతిత్వ‌ర‌లో పూర్త‌య్యే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. అది కూడా అందుబాటులోకి వ‌స్తే.. ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్ర‌జ‌లు న‌చ్చిన సినిమాల్ని ఆస్వాదించొచ్చు.

This website uses cookies.