Categories: LATEST UPDATES

హైదరాబాద్లో.. 2023లో 25 వేల ఇళ్లు పూర్తి!

  • అనరాక్ ఛైర్మన్ అనూజ్ పూరి

2022లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో సుమారు 81,580 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని అనరాక్ సంస్థ తాజాగా వెల్లడించింది. మరి, ఈ మూడింటిలో ఏయే నగరంలో ఎన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయనే విషయంలో స్పష్టతనివ్వలేదు. సాధారణంగా, హైదరాబాద్లో ప్రతిఏటా పాతిక వేల దాకా ఫ్లాట్లు అమ్ముడౌతాయి. ఈ సంఖ్య ఒకట్రెండేళ్ల నుంచి పెరిగిందని నిపుణులు అంటున్నారు. మరి, పెరిగిన సంఖ్య ఎంతో కచ్చితంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, ఫ్లాట్లను కొనేవారు కొందరు రిజిస్ట్రేషన్ చేయకపోవడమో ప్రధాన కారణం.

అంతా సవ్యంగా సాగితే.. ఈ ఏడాది భారతదేశంలోని ఏడు బడా నగరాల్లో 5.44 లక్షల యూనిట్ల నిర్మాణం పూర్తవుతుందని.. అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. ఆర్థిక మాంద్యం ప్రభావం నిర్మాణ రంగం మీద పడకపోతే.. డెవలపర్లు ప్రస్తుత నిర్మాణాల్ని పూర్తి చేసి.. కొత్త కట్టడాల్ని ఆరంభించడంపై ద్రుష్టి పెడతారని తెలిపారు. ఒకవేళ నిర్మాణ పనులన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో సుమారు 1.67 లక్షల ఫ్లాట్ల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఆతర్వాతి స్థానం 1,32,900 యూనిట్లతో ముంబై నిలుస్తుందన్నారు. హైదరాబాద్లో ఈ ఏడాది కేవలం 25,120 యూనిట్లు మాత్రమే పూర్తవుతాయని తెలిపారు.

This website uses cookies.