poulomi avante poulomi avante

సువిశాల విస్తీర్ణంలో “అపర్ణా వన్”.. ప్రత్యేక‌త‌లు

విలాసవంతమైన జీవనాన్ని కోరుకునేవారికో బ్రహ్మండమైన ప్రాజెక్టు హైదరాబాద్లో ఆరంభమైంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలో టాప్ డెవలపర్ గా గుర్తింపు పొందిన అపర్ణా కన్ స్ట్రక్షన్స్ షేక్ పేట్ లో అపర్ణా వన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికి అపర్ణా వన్ అని పేరు పెట్టింది.

హైదరాబాద్ నిర్మాణ రంగంలో అపర్ణా కన్ స్ట్రక్షన్స్ కు మంచి పేరుంది. ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన నిర్మాణాల్ని చేపడుతుందనే ఖ్యాతినార్జించింది. ఈ కంపెనీ సుమారు 9.7 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు ఆరు బ్లాకుల్ని సంస్థ నిర్మిస్తోంది. ఒక బ్లాకును కేవలం క్లబ్ హౌజ్, ఆధునిక సదుపాయాల కోసమే కేటాయించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలకు షేక్ పేట్ చేరువగా ఉంది. మరోవైపు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు దగ్గరగా ఉంది. అందుకే, ఈ ప్రాజెక్టుపై కొనుగోలుదారుల్లో ఎక్కడ్లేని ఆసక్తి పెరిగింది.

Shaikpet APARNA ONE
Shaikpet APARNA ONE

ప్రత్యేకతలివే..

  • ధర: రూ. 3.5 కోట్ల నుంచి ఆరంభం
  • ఫ్లాట్ల విస్తీర్ణం: 3 బీహెచ్ కే: 2635 & 2876 చ.అ.
  • ఫ్లాట్ల విస్తీర్ణం: 4 బీహెచ్ కే: 4155, 4920 & 5216 చ.అ.
  • క్లబ్ హౌజ్: 65000 చ.అడుగులు
  • ఎప్పుడు పూర్తి? 2023 డిసెంబరు
అపర్ణా వన్ ప్రత్యేకత ఏమిటంటే, స్మార్ట్ హోమ్స్ అనే వినూత్న కాన్సెప్టును ఆరంభించింది. జస్ట్ మీరు నోటి ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు.. ప్రతి ఫ్లాటులోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, గీజర్, టీవీ వంటివి పని చేస్తాయి. వాష్ రూము లైట్లు, ప్యానిక్ బటన్, గ్యాస్ లీక్ డిటెక్టర్లు వంటివి ప్రతి ఫ్లాటులో అపర్ణా సంస్థ ప్రవేశపెట్టింది. ఉష్ణోగ్రత నియంత్రణ కలిగిన ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులోని నిర్మాణ ప్లాన్, ఆర్కిటెక్చర్, నిర్వహణ వంటివాటికి ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ ప్లాటినం సర్టిఫికేషన్ లభించింది. సుస్థిరమైన జీవనాన్ని కోరుకునేవారికి తమ ప్రాజెక్టు చక్కగా నప్పుతుందని అపర్ణా సంస్థ చెబుతోంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles