Categories: LATEST UPDATES

హస్తినలో అపార్ట్ మెంట్ విక్రయాలు అదుర్స్..

  • గతేడాది రూ.87,818 కోట్ల విలువైన యూనిట్ల అమ్మకం

దేశ రాజధాని ఢిల్లీలో అపార్ట్ మెంట్ల విక్రయాలు జోరుగా సాగాయి. గతేడాది ఢిల్లీ-ఎన్ సీఆర్ లో రూ.87,818 కోట్ల విలువైన అపార్ట్ మెంట్లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రాతిపదికన ఈ విలువ 23 శాతం పెరిగింది. ఇక ఒక్కో అపార్ట్ మెంట్ సగటు ధర 2022లో రూ.1.86 కోట్లు ఉండగా.. గతేడాది అది రూ.2.29 కోట్లకు పెరిగినట్టు జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. అపార్ట్ మెంట్ల సగటు పరిమాణం, విక్రయించిన యూనిట్ల సంఖ్య (38,407 యూనిట్లు) దాదాపు అదే స్థాయిలో ఉంది. మొత్తం విక్రయాల్లో గురుగ్రామ్ లో అపార్ట్ మెంట్ల విలువ రూ.55,390 కోట్లు కాగా, నోయిడా-గ్రేటర్ నోయిడాలో రూ.24,944 కోట్లు, ఘజియాబాద్ లో రూ.4,404 కోట్లు, ఢిల్లీలో రూ.2,610 కోట్లు, ఫరీదాబాద్ లో రూ.470 కోట్లుగా ఉంది. కాగా, ద్వారకా ఎక్స్ ప్రెస్ వే, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వంటి కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధితో 2024లో రెసిడెన్షియల్ విభాగంలో అమ్మకాలు రూ.95వేల కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. చదరపు అడుగుకు సగటు ధర 13 శాతం పెరగడంతో అమ్మకాల విలువ పెరిగింది.

This website uses cookies.