ఆస్తి పన్ను చెల్లించని ప్రజల కోసం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వడ్డీ రాయితీ పథకం తీసుకొచ్చింది. ఇప్పటివరకు పన్ను చెల్లించనివారికి వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ అవకాశం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి కొత్త ఫార్ములా ప్రకారం లెక్కించిన ఆస్తి పన్నులపై 100 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని వెల్లడించింది. పాత ఫార్ములా కిందకు వచ్చే ప్రాపర్టీల విషయంలో స్లమ్, చాల్ నివాసితులకు 100 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని వివరించింది. ఫ్లాట్లు, బంగ్లాల ఆస్తి పన్నులపై 75 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని, వాణిజ్య ప్రాపర్టీల విషయంలో 60 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని పేర్కొంది. కాగా, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 221 కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే పన్ను వసూలు డ్రైవ్ లో భాగంగా రూ.17.38 లక్షలు వసూలు చేసింది.
This website uses cookies.