ఏపీ రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పురణకు వచ్చేలా అమరావతి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం ఉండాలన్నారు. . జీ+7విధానంతో నిర్మాణం తలపెట్టిన సీఆర్డీయే కార్యాలయంను గత టీడీపీ ప్రభుత్వంలో ఏమాత్రం చేపట్టామో అంతకుమించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు కదల్లేదని, గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను పూర్తీగా వదిలేసిందని అధికారులతో సీఎం ప్రస్తావించారు. .
ఇప్పుడు ఈ భవన నిర్మాణం పూర్తి చేయనున్నామని అధికారులు తెలిపారు. ఈ భవన నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తీ చేసి కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు కూడా అత్యాధుని టెక్నాలజీలను ఉపయోగించి, నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని సూచించారు.
This website uses cookies.