తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బందరు-కాకినాడ పోర్టులతో అనుసంధానం
డ్రైపోర్ట్ నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణనలోకి తీసుకోవాలని, దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు ఏరకంగా మేలు జరుగుతుందనే విషయం ప్రాధాన్యతలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇవన్నీ అధ్యయనం చేశాకే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. రైలు, జల మార్గంతో కూడిన ఇన్‌ల్యాండ్ వాటర్ వే లకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలపగా.. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడైనా అలాంటిది ఉందా…? సక్సెస్ రేట్ ఎలా ఉంది.. ప్రతిపాదనలేనా… వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందా అనే దానిపై అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా తనకు నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
This website uses cookies.