రాజీవ్ స్వగృహ టౌన్ షిప్ లోని ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన లభించింది. మహబూబ్ నగర్ లోని రాజీవ్ స్వగృహ సారిక టౌన్ షిప్ లోని ఓపెన్ ప్లాట్లకు నిర్వహించిన వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.15.33 కోట్ల ఆదాయం లభించింది. మొత్తం 45 ప్లాట్లు అమ్ముడు కాగా.. 190 మంది బిడ్డర్లు వేలంలో పాల్గొన్నారు. అత్యధికంగా చదరపు అడుగుకు రూ.19 వేలు ధర పలకగా.. అత్యల్పంగా చదరపు అడుగుకు రూ.8,100 ధర వచ్చింది.
భూత్ పూర్ మున్సిపాలిటీ ఏడో వార్డులో ఉన్న ఈ ప్లాట్ల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి కనబరిచారు. ఇవి ప్రభుత్వ ప్లాట్లు కావడం, అన్ని సౌకర్యాలూ కలిగి ఉండటంతో చాలామంది ఎగబడ్డారు. కరీంనగర్ లో నిర్వహించిన ప్లాట్ల వేలానికి కూడా మంచి స్పందన వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కోసం చదరపు అడుగుకు అత్యధికంగా రూ.21,400 వెచ్చించారు.