poulomi avante poulomi avante

మన్నత్ పునరుద్ధరణ.. ఫ్లాట్ అమ్మిన గౌరీ ఖాన్

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హెరిటేజ్ నివాసం మన్నత్ ను పునరుద్ధరిస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆయన భార్య గౌరీ ఖాన్ ఓ ఫ్లాట్ ను విక్రయించారు.

దాదర్ వెస్ట్ లో ఉన్న 2వేల చదరపు అడుగుల విలాసవంతమైన ప్లాట్ ను రూ.11.61 కోట్లకు అమ్మినట్టు ప్రాపర్టీ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. ఈ లావాదేవీ మార్చి 28న జరిగింది. కొనుగోలుదారులు దేవేంద్ర చౌకర్ (87.5% వాటా), వందన అగర్వాల్ (12.5% వాటా) అని ఆ పత్రాల్లో ఉంది. ఈ అపార్ట్ మెంట్ ముంబై దాదర్ వెస్ట్ లోని కోహినూర్ అల్టిస్సిమో (కోహినూర్ స్క్వేర్) ప్రాజెక్ట్ 21వ అంతస్తులో ఉంది. కోహినూర్ స్క్వేర్ అల్టిస్సిమో అనేది ప్రపంచ స్థాయి జీవనాన్ని అందించే విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ. ఈ ప్రాజెక్ట్ కోహినూర్ సీటీఎన్ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన రెడీ-టు-మూవ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో భాగంగా ఉంది.

ఈ అపార్ట్ మెంట్ రెండు కార్ పార్కింగ్‌లతో పాటు వస్తుంది. బిల్ట్-అప్ ఏరియాలో చదరపు అడుగుకు ₹58,507 చొప్పున ధర పలికినట్టయింది. గౌరీ ఖాన్ ఈ అపార్ట్ మెంట్‌ను ఆగస్టు 2022లో రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి దాని విలువ 37% పెరిగి రూ. 11.61 కోట్లకు చేరుకుంది. కాగా, ప్రస్తుతం షారుక్ ఖాన్ వారి నివాసమైన మన్నత్ ను పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలి హిల్‌లోని రెండు విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్‌లను మూడు సంవత్సరాల పాటు రూ.8.67 కోట్ల అద్దెకు తీసుకున్నారు. మన్నత్ పునరుద్ధరణకు రెండేళ్లు పడుతుందని అంచనా.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles