Categories: PROJECT ANALYSIS

పచ్చదనం మధ్య.. అరబిందో రీజెంట్

  • శేరిలింగంపల్లిలో అద్భుతం
  • ఈ న‌యా హైరైజ్ ప్రాజెక్టు..

సువిశాలమైన పచ్చదనం మధ్య ఖరీదైన జీవనశైలిని ఆస్వాదించాలనుకునేవారికి అరబిందో రియాల్టీ సంస్థ అత్యద్భుతంగా నిర్మిస్తున్న రీజెంట్ ప్రాజెక్టు చక్కగా సరిపోతుంది. పచ్చదనాన్ని చూస్తూ గోపి చెరువు పైనుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ ప్రతిరోజూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇంతకుమించిన స్థలం మరొకటి ఉండదేమో.

శేరిలింగంపల్లిలో ఏకంగా 2300 ఎకరాల సువిశాలమైన పచ్చని స్థలాన్ని వీక్షించేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్టు నభూతో న భవిష్యత్ అనడంతో ఎంతమాత్రం సందేహం లేదు. ఫేజ్-1లో 6.3 ఎకరాల స్థలంలో 39 అంతస్తులతో మూడు ప్రతిష్టాత్మక టవర్లు నిర్మితమవుతున్నాయి. 80కి పైగా ఆధునిక జీవన సౌకర్యాలతో హైటెక్ సిటీ, ఇతర ప్రముఖ ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టు.. మీ కలల సౌధానికి కేరాఫ్ అడ్రస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

రెండు ఎంట్రీ పోర్టల్స్ తోపాటు వాటర్ బాడీతో కూడిన స్కల్ ప్చర్ ప్లాజ్, సెక్యూరిటీ కియోస్క్, విజిటర్ పార్కింగ్, ఫ్లోటింగ్ డెక్, ఔట్ డోర్ పార్టీ లాన్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, పూల్ డెక్, థీమ్ గార్డెన్, పిల్లల ఆటస్థలం, అడ్వెంచర్ కిడ్స్ ప్లే ఏరియా, ఫన్ లాన్, బాస్కెట్ బాల్ కోర్టు, లూప్ గ్యారీ, బర్డ్స్ పార్క్, బీచ్ వాలీబాల్ కోర్టు, ఆరోమా గార్డెన్, యోగా పెవిలియన్, ఫ్లోరల్ గార్డెన్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, రీడింగ్ కార్నర్, బస్ షెల్టర్, అర్బన్ ఫారెస్ట్, సర్వీస్ యార్డ్ వంటి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 50వేల చదరపు అడుగులో విలాసవంతమైన క్లబ్ హౌస్ డిజైన్ చేశారు.

అన్ని టవర్లలో కేవలం 3 బీహెచ్ కే ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. 1497-1950 చదరపు అడుగుల పరిమాణంలో ప్రత్యేకంగా వీటిని డిజైన్ చేశారు. 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలోనే ప్రముఖ ఆస్పత్రులు, సాపింగ్ మాల్స్ ఉన్నాయి. మూడు కిలోమీటర్ల దూరంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ ఉండగా.. 7.3 కిలోమీటర్ల దూరంలో రాయదుర్గం మెట్రో స్టేషన్ ఉంది. మియాపూర్ మెట్రో స్టేషన్ 11 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. శంషాబాద్ విమానాశ్రయం 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం 0.6 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషం.

This website uses cookies.