ఆటోమేటివ్ పాసివ్ సేఫ్టీ టెక్నాలజీ ప్రొవైడర్ జెడ్ ఎఫ్ లైఫ్ టెక్.. హైదరాబాద్ లో 5 మిలియన్ యూరోల పెట్టుబడితో ఏర్పాటు చేసిన కేపబిలిటీ సెంటర్ ప్రారంభమైంది. సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు దీనిని ప్రారంభించారు. తెలంగాణలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని.. వాహన రంగంలో భద్రతకు సంబంధించి జెడ్ ఎఫ్ లైఫ్ టెక్ సంస్థ చక్కని ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగాలని సూచించారు.
ప్రపంచ ఇంజనీరింగ్ అవసరాలకు అనుగుణంగా నూతనంగా ప్రారంభించిన జెడ్ ఎఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ద్వారా కార్లు, ఇతర వాహనాల సీటు బెల్టులు, ఎయిర్ బ్యాగులు, స్టీరింగుల్లో అధునాతన సాంకేతికత ద్వారా భద్రతా ప్రమాణాలు పెంచుతామని సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రూడాల్ఫ్ స్టార్క్ తెలిపారు. సేఫ్టీ టెక్నాలజీలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ దిగ్గజ సంస్థలతో కలిసి పని చేస్తామని జెడ్ఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆకాశ్ పస్సే తెలిపారు.