హైదరాబాద్‌లో చాలామంది రియల్టర్లు.. ప్లాట్లు అమ్మిన తర్వాత.. లేఅవుట్ ని అభివృద్ధి చేస్తారు. కానీ, ఈ సంస్థ మాత్రం మొదట అభివృద్ధి పనుల్ని చేపట్టాకే అమ్మకాల్ని ఆరంభించింది. మరో రెండు, మూడు నెలలైతే అందులో ప్లాట్లు కొనుక్కున్నవారు ఇళ్లు కట్టుకునీ నివసించొచ్చు. నగర రియల్ రంగంలోనే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆ సంస్థే.. అవని ప్లాట్స్. ఈ సంస్థ మేడ్చల్ ప్రధాన రహదారి మీద డెవలప్ చేసిన వెంచర్ గురించి తెలుసుకుంటే.. మీరు ఎంచక్కా అందులో ప్లాటు కొనేసి.. అక్కడే ఇల్లు కట్టుకుని నివసిస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. మరి, అవని ప్లాట్స్ ప్రీమియం వెంచర్ కమ్యూనిటీ విశేషాల గురించి రియల్ ఎస్టేట్ గురు పాఠకులకు ప్రత్యేకం..
నగరానికి చెందిన అవని ప్లాట్స్ ప్రత్యేకత ఏమిటంటే.. రియల్ రంగంలో పారదర్శకతను తెచ్చేందుకు కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ, రెరా అనుమతుల్ని తీసుకుని అవని ప్లాట్స్ వెంచర్‌లో అభివృద్ధి పనుల్ని చేపట్టింది. వెంచర్‌లో సుమారు డెబ్బయ్ శాతానికి పైగా డెవలప్‌మెంట్ చేసి.. నాణ్యమైన రీతిలో సిమెంట్ రోడ్లను అభివృద్ధి చేశాకే ఈ వెంచర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మొత్తం వెంచర్‌లో నివాసితులకు అవసరమయ్యే ప్రాథమిక సదుపాయాలన్నీ పొందుపర్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్తు సదుపాయాం, మంచినీటి సౌకర్యం వంటివన్నీ కల్పించింది. ప్రతి ప్లాటుకు ప్రత్యేకంగా మంచినీటి సదుపాయాన్ని అవని ప్లాట్స్ అందజేస్తోంది.
సాధారణంగా ప్లాట్లు కొనుగోలు చేసేవారు ఏం కోరుకుంటారు? అభివృద్ధికి చేరువలో ఉండాలని ఆశిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే పరిసరాల్లో జీవించాలని ఆశిస్తారు. ఇలాంటి వారందరికీ చక్కగా నప్పే ప్రీమియం వెంచర్ అవని ప్లాట్స్. సరిగ్గా మేడ్చల్ హైవే మీదే.. కలక్కల్ మెయిన్ రోడ్డు మీదే 18 ఎకరాల్లో అభివృద్ధి చేస్తోంది. ఇందులో వచ్చేవి సుమారు 232 ప్లాట్లు కాగా.. ప్లాట్ల విస్తీర్ణం 168 నుంచి 300 గజాల్లోపు ఉన్నాయి. ఇందులో 168 గజాల ప్లాటు ధర సుమారు రూ.45 లక్షల్నుంచి ఆరంభం.
18 ఎకరాల విస్తీర్ణం
మొత్తం 232 ప్లాట్లు
168- 300 గజాలు
పార్క్, ప్లే ఏరియా
అండర్‌గ్రౌండ్ వరదనీటి కాల్వలు
ఎవెన్యూ ప్లాంటేషన్
ప్రతి ప్లాటుకు నీటి సౌకర్యం
అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ సప్లై
రెయిన్ వాటర్ హర్వెస్టింగ్ పిట్స్
This website uses cookies.