Categories: TOP STORIES

మెరుగైన నిర్వ‌హ‌ణ‌ ఏవీఎల్స్ ప్ర‌కృతి!

  • మ‌ణికొండ‌లో మంచి క‌మ్యూనిటీ
  • అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులుగా
    శ్రీనివాస్‌, అభిషేక్ రెడ్డి
  • ట్రెజరర్.. నిశాంత్

అపార్టుమెంట్ మెయింటనెన్స్ మెరుగ్గా ఉంటే అందులో నివసించేవారికే పండగే పండ‌గ‌. ప్రతిఒక్కరూ కలిసిమెలిసి ఉంటూ.. పండుగలన్నీ ఆనందంగా జరుపుకుంటూ ఉంటే అంతకంటే ఎక్కువేం కావాలి? ఇలాంటి ఒక చ‌క్క‌టి కమ్యూనిటీని మీ అందరికీ రియల్ ఎస్టేట్ గురు పరిచయం చేస్తోంది.

మణికొండ అంటే అందరికీ తెలిసిందే. అటు గచ్చిబౌలికి ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుకు కూతవేటు దూరంలో ఉంటుందీ ప్రాంతం. ఇక్కడ్నుంచి హైటెక్ సిటీకి అయినా, జూబ్లీహిల్స్ కు అయినా సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. ఓక్రిడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటివి ఎంతో చేరువగా ఉంటాయీ ప్రాంతానికి. పైగా, నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర్లోనే ఉంటుంది. ఆస్పత్రులు, బ్యాంకులు, ఏటీఎంలు, రెస్టారెంట్లు.. అన్నీ చుట్టుపక్కలోనే ఉంటాయి. మరి, ఇంత స్ట్రాటజిక్ లొకేషన్ అయిన మణికొండలో.. గత ఏడాదిన్నర నుంచి ఏవీఎల్స్ ప్రకృతి అపార్టుమెంట్స్ అనే క‌మ్యూనిటీని ఎంతో మెరుగ్గా నిర్వ‌హిస్తోంది.. అందులోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌. ఈ సంఘానికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన అభిషేక్ రెడ్డి రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. సారాంశం ఆయ‌న మాట‌ల్లోనే..

గ‌త ఏడాదిన్న‌ర నుంచి మా క‌మ్యూనిటీని మెరుగైన రీతిలో నిర్వ‌హిస్తున్నాం. జిమ్‌, స్విమ్మింగ్ పూల్‌, గేమ్స్ రూమ్‌, కిడ్స్ ష‌టిల్ కోర్టులు, కిడ్స్ ప్లే ఏరియాలు వంటివి ఉన్నాయి. 24 గంట‌లూ విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉంటుందీ మా క‌మ్యూనిటీలో. సెక్యూరిటీ ఇర‌వై నాలుగు గంట‌లు అందుబాటులో ఉంటారు. ఇన్నిన్ని స‌దుపాయాలు ఉన్న‌ప్ప‌టికీ, మ‌ణికొండ‌లోని ఇత‌ర క‌మ్యూనిటీలతో పోల్చితే మా మంత్లీ మెయింట‌నెన్స్ తక్కువే. నెల‌కు రూ.2,500 మాత్ర‌మే.

 

మా ఈ సంఘానికి అధ్యక్షుడిగా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా కరుణాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ దిలీప్ కుమార్, నరేష్ క్రిష్ణ జాయింట్ ట్రెజరర్ గా ఉన్నారు. సతీష్ రెడ్డి, నిరంజన్, సాధనా రెడ్డి, వినోద్ బాబు, నారాయణ స్వామిలు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి, మా కమ్యూనిటీలోని సభ్యులకు ఎలాంటి సమస్యలున్నా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. మెరుగైన క‌మ్యూనిటీగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. గ‌త‌వారం 75వ‌ స్వాతంత్య్ర సంబురాల్ని ఘ‌నంగా జ‌రుపుకున్నాం.

This website uses cookies.