Categories: AREA PROFILE

బండ్ల‌గూడ‌లోకి బెంగ‌ళూరు సంస్థ‌

బెంగ‌ళూరుకు చెందిన ఎల్వీ ప్రాజెక్ట్స్ హైద‌రాబాద్‌లోకి అడుగుపెట్టి హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఆదిభ‌ట్ల‌, బండ్ల‌గూడ జాగీరులో రెండు ప్రాజెక్టుల్ని ఆరంభించింది. ఆదిభ‌ట్ల‌లో ఫ్లాట్ బుక్ చేస్తే ఐఫోన్ 13ప్రోను బ‌హుమ‌తిగా అంద‌జేసింది. బండ్ల‌గూడ‌లో ఈఎల్‌వీ 55 ఈస్ట్‌ఫోర్ట్‌లో ఫ్లాట్ బుక్ చేస్తే.. రూ.1.5 ల‌క్ష‌ల విలువ గ‌ల హోమ్ ఆటోమేష‌న్ ఉచితంగా అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించింది. మొత్తానికి, ఫెస్టివ‌ల్ సీజ‌న్‌లో భాగంగా, ఆగ‌స్టు 31 వ‌ర‌కూ వ‌ర్తింప‌జేసిన ఈ స్కీముల‌ను మ‌రికొంత‌కాలం కొన‌సాగిస్తుందా అని క‌స్ట‌మ‌ర్లు ఎదురు చూస్తున్నారు. ఆదిభ‌ట్ల‌లో 2 బెడ్రూమ్ ఫ్లాట్ ధ‌ర‌.. కేవ‌లం రూ.48 ల‌క్ష‌ల‌ని ప్ర‌క‌టించింది.

బండ్ల‌గూడ‌లో నిర్మిస్తున్న ఈఎల్‌వీ 55 ఈస్ట్‌ఫోర్ట్‌లో టూ బెడ్రూమ్ ఫ్లాట్ ధ‌ర‌.. రూ.62 ల‌క్ష‌ల నుంచి ఆరంభ‌మ‌వుతుంది. 85 ఫ్లాట్లు గ‌ల ఈ అపార్టుమెంట్‌ని 2024 మార్చిలోపు అంద‌జేస్తామ‌ని చెబుతోంది. రెరా, జీహెచ్ఎంసీ అనుమ‌తి పొందిన ఈ ప్రాజెక్టులో ఇర‌వైకి పైగా ప్ర‌పంచ‌స్థాయి ఎమినిటీస్ అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించింది. మ‌రి, ఈ సంస్థ స‌కాలంలో ప్రాజెక్టును అందించి త‌మ పేరును నిల‌బెట్టుకుంటుందో లేదో తెలియాలంటే.. కొంత‌కాలం వేచి చూడాల్సిందే.

This website uses cookies.