సిటీలో ఇళ్లు ఉన్నా శివారులో విల్లా కొనుగోలుశివార్లలో మౌలిక వసతల మెరుగే కారణంరవాణా సౌకర్యం పెరగడంతో శివార్ల వైపు మొగ్గుకాలుష్యం లేని వాతావరణం కోసం విల్లానగర శివార్లలో జోరుగా విల్లాల నిర్మాణంరూ. 75 లక్షల నుంచి 20 కోట్ల రేంజ్ లో విల్లాలు
హైదరాబాద్ లో మంచి ప్రాంతంలో సొంత ఇళ్లుంటే చాలు.. ఇది ఒకప్పటి మాట. నగరంలో ఇళ్లు.. శివారులో విల్లా.. ఇది లెటెస్ట్ ట్రెండ్. హైదరాబాద్ లో ఇళ్లు లేదా ఆపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ఉన్నా.. శివారు ప్రాంతంలో ఓ విల్లా కూడా కావాలంటున్నారు నగర వాసులు. రెండూ సాధ్యం కాకపోతే నగరంలో ఇళ్లు అమ్మేసి అయినా.. శివారులో విల్లా కొంటున్నారు మరికొందరు. అవును, ఇప్పుడు హైదరాబాద్ శివారులో విల్లాల వైపు మొగ్గు భాగ్యనగర వాసులు చూపుతున్నారు.
సొంత ఇల్లు కావాలని అందరు కోరుకుంటారు. అయితే గతంలో పని చేసే ప్రాంతానికి దగ్గరగా ఇళ్లు ఉంటే చాలని అంతా అనుకునేవారు. అందుకు అనుగుణంగానే నచ్చిన ప్రదేశంలో ఇల్లు కట్టుకోవడమో, కొనడమో చేసేవారు. కానీ కాలానుగునంగా ప్రజల అభిరుచుల్లోను మార్పులు వస్తున్నాయి. కరోనా తదనంతర పరిణామాలు నేర్పిన పాఠాల నుంచి జనం ఆలోచనల్లోను మార్పు కనిపిస్తోంది. ఎందుకంటే నగరంలో కేవలం సొంత ఇళ్లు ఉంటే సరిపోదంటున్నారు చాలా మంది నగరవాసులు. సిటీ శివార్లలో విల్లా కూడా కావాలని కోరుకుంటున్నారు. కేవలం కోరుకోవడమే కాదు.. స్థోమత ఉన్న వాళ్లు నగరంలో ఇంటితో పాటు, శివారులో విల్లా సైతం కొంటున్నారు.
కొందరు రెండో ఇల్లుగా నగర శివారులో విల్లాలు ఖరీదు చేస్తుంటే, మరికొందరు సిటీలో బహుళ అంతస్తుల్లోని ఫ్లాట్ విక్రయించి మరీ విల్లాలు కొంటున్నారు. నగర శివార్లలోని విల్లా ప్రాజెక్టుల్లో అన్ని సౌకర్యాలకు లోటు లేకపోవడం, సొంత కార్లు ఉండటంతో దూరమైనా లెక్కచేయడం లేదు. వీకెండ్ లో అక్కడి ప్రశాంత వాతావరణంలో ఉండటానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. కొందరైతే పూర్తిగా నగర శివారులోని విల్లాల్లోకి మకాం మార్చేస్తున్నారు. దీంతో శివార్లలో విల్లాలకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. నేటితరం కోరుకునే విధంగా ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా నిర్మాణాలు ఉండడంతో విల్లాలపై మనసు పారేసుకుంటున్నారు. ఏ మాత్రం కొనే స్థోమత ఉన్న ఆలస్యం చేయకుండా చాలా మంది శివార్లలో విల్లాలు కొంటున్నారు.
హైదరాబాద్ నగరం నుంచి శివార్లకు అవుటర్ రింగ్ రోడ్డుతో రవాణా అనుసంధానం పెరగడంతో విల్లాలవైపు మొగ్గుచూపుతున్నారు. విల్లాలు కొనేవారిలో అత్యధిక మందికి సొంత కార్లు ఉండటంతో వీరు ఎక్కడికైనా తక్కువ సమయంలోనే వెళ్లిపోతున్నారు. అంతే కాదు శివార్లలోని ప్రధాన ప్రాంతాల్లో మౌలికవసతులు పెరగడం కూడా ఇందుకు ఓ కారణమని చెప్పవచ్చు. గతంలో మల్టీఫ్లెక్స్లు, షాపింగ్కు సిటీకి రావాల్సి ఉండగా, ప్రస్తుతం శివార్లలోను ఎక్కడికక్కడ రెస్టారెంట్లు, ఆసుపత్రులు, మల్టీఫ్లెక్స్ల అందుబాటులోకి వచ్చాయి. ఓఆర్ఆర్ నుంచి ఆయా ఎక్కడికి కావాలన్నా నిమిషాల వ్యవధిలోనే చేరుకునేంత దగ్గరగా ఉంటున్నాయి. ఇవన్నీ విల్లా ప్రాజెక్టులకు కలిసి వస్తున్నాయి. దీంతో ఓఆర్ఆర్ చేరువగానే ఎక్కువగా విల్లాలే నిర్మాణంలో ఉన్నాయి.
ఒక్కో విల్లాను 120 చదరపు గజాలు మొదలు 500 గజాలు అంతకు మించి విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఎక్కువగా ఇవి అందుబాటులో ఉన్నాయి. జీ ప్లస్1, జీ ప్లస్2 అంతస్తుల్లో విల్లాలను నిర్మిస్తున్నారు. త్రిపుల్, ఫోర్ బెడ్ రూం విల్లాలు నిర్మించే విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి ధరలు ఉన్నాయి. వీటిల్లో విలాసవంతమైన ప్రాజెక్టులే కాకుండా బడ్జెట్ ధరల్లోనూ విల్లాలను నిర్మిస్తున్నాయి రియల్ రంగ సంస్థలు. అందుకే గతంతో పోలిస్తే ఎక్కువ మంది విల్లాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. మధ్యతరగతి వాసులు సైతం తమ పాత ఇళ్లను, స్థలాలను విక్రయించి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు.
ఇక హైదరాబాద్ శివారు ప్రాంతంలో నిర్మాణం జరుపుకుంటున్న కొన్ని విల్లా ప్రాజెక్టులను చూస్తే.. కొల్లూరులో రాధే కన్స్ట్రక్షన్ ఇండియా నిర్మిస్తున్న రాధే రాజ విల్లా ప్రాజెక్టులో 3778 నుంచి 4596 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5.9 కోట్ల నుంచి 7.18 కోట్ల రూపాయల ధరల్లో విల్లాలు అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం హైవేపై గీతికా డెవలపర్స్ నిర్మిస్తున్న గీతికా ఎన్‌స్కాన్సియా ప్రాజెక్టు లో సుమారు 3.5 కోట్ల రూపాయల్లో విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ఇక బీరంగూడలో ప్రణీత్ ప్రణవ్ సంస్థ నిర్మిస్తున్న నైబర్ వుడ్ ప్రాజెక్టులో ట్రిపుల్ బెడ్రూం విల్లా 1.91 కోట్లు, ఫోర్ బెడ్రూం విల్లా 2.52 కోట్ల రూపాయలుగా ధరలున్నాయి. శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లిలో కాసా గ్రాండ్ బిల్డర్స్ నిర్మిస్తున్న కాసా గ్రాండ్ హ్యాన్ ఫోర్డ్ ప్రాజెక్టులో 2.9 కోట్ల రూపాయల ధరలో విల్లాలు అందుబాటులో ఉన్నాయి.
ఇక సాగర్ హైవేపై ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న ఏపీఆర్ ప్రవీణ్స్ గోల్డెన్ లీఫ్ లో మూడు, నాలుగు బెడ్రూం విల్లాలు 1.33 కోట్ల నుంచి 2.46 కోట్ల రూపాయల మధ్య ధరలున్నాయి. సిటీకి కాస్త దూరంలో కంది దగ్గర సార్క్ నార్త్ టౌన్ హోమ్స్ విల్లాలు కేవలం 75 లక్షల నుంచి అందుబాటు ధరల్లో నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఇక గాగిల్లాపూర్ లో ప్రణీత్ గ్రూప్ నిర్మిస్తున్న ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ ప్రాజెక్టులో 1.57 కోట్ల నుంచి 3.29 కోట్ల మధ్య విల్లాలు అందుబాటులో ఉన్నాయి. గచ్చిబౌలిలో వెర్టెక్స్ హోమ్స్ నిర్మిస్తున్న వెర్టెక్స్ కింగ్స్టన్ పార్క్ ప్రాజెక్టులో ఫోర్, ఫైవ్ బెడ్రూం విల్లాలు 8.24 కోట్ల నుంచి 11.74 కోట్ల రూపాయల మధ్య ధరలున్నాయి. శ్రీశైలం హైవే కు సమీపంలోని రావిర్యాలలో సార్క్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న సార్క్ సౌత్ మిడోస్ లో 1.8 కోట్లుగా విల్లాల ధరలున్నాయి. ఇలా నగరం నలువైపులా వందలాది విల్లా ప్రాజెక్టుల్లో 75 లక్షల నుంచి మొదలు 20 కోట్ల రూపాయల వరకు విల్లాల ధరలున్నాయి.
This website uses cookies.