poulomi avante poulomi avante

భార‌తీ బిల్డ‌ర్స్ రూ.80 కోట్ల ప్రీలాంచ్ మోసం

భారతీ లేక్​ వ్యూ పేరుతో దందా
నిర్మాణాలు చేపట్టని భారతీ బిల్డర్స్
ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతో రెచ్చిపోయిన సంస్థ
ఒకచోట ప్రాజెక్టు మొదలుపెట్టి అక్రమంగా వసూళ్లు
నిర్మాణాలు చేయకుండానే.. భూమిని అమ్మేసిన వైనం
అదే సొమ్ముతో మరోచోట భూమికి అడ్వాన్స్

రెజ్ న్యూస్‌, హైద‌రాబాద్‌

ప్రీలాంచ్​ ఆఫర్లతో కోట్లు వసూలు చేసిన మరో సంస్థ భాగోతం బయట పడింది. కోట్లు వసూలు చేసి, నిర్మాణాలు చేయకుండా బయ్యర్ల సొమ్ముతో విలాసాలు చేసిన భారతీ బిల్డర్స్​వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రీలాంచ్​ పేరుతో.. తక్కువ ధరకే ప్లాట్స్ అంటూ బ్రోచ‌ర్ల‌ల్లోనే ఫ్లాట్లను చూపించారు. ఇప్పటికే పలు సంస్థలు ఇలా ప్రీలాంచ్​ ఆఫర్లను ప్రకటించి నిలువునా మోసం చేస్తుండగా.. తాజాగా భారీ ప్రీ లాంచ్ ఆఫర్ మోసం వెలుగులోకి వ‌చ్చింది. కొంపల్లి ప్రాంతంలో నివాస గృహాలు నిర్మిస్తామని మాయ మాటలతో ‘ప్రీ లాంచ్ ఆఫర్ల’ పేరుతో దాదాపు రూ80 కోట్ల వరకు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో భారతి బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, కంపెనీ ఎండీ ముల్పూరి శివరామ కృష్ణ, కంపెనీ సీఈవో తొడ్డాకుల నరసింహారావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 406, 420, తెలంగాణ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-1999లోని సెక్షన్‌ 5 కింద కేసులు నమోదు చేశారు.

కంపెనీ చైర్మన్ దూపాటి నాగరాజు, ఎండీ ముల్పూరి శివరామ కృషా 2021లో భారతి బిల్డర్స్‌ను ప్రారంభించి, కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిని తీసుకుని, “భారతి లేక్ వ్యూ” పేరుతో అపార్ట్‌మెంట్లను నిర్మించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బీవీఎస్ ప్రసాదరావుతో పాటు మరో 350 మంది ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌లోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది . డీసీపీ కె.ప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ జె.వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రంగుల కలభారతీ లేక్​ వ్యూ పేరుతో నిర్మాణాలు చేస్తున్నట్లు భారతీ బిల్డర్స్​ 2021లో ప్రకటించింది. రంగురంగుల బ్రోచర్‌లను ప్రచురించిన సదరు సంస్థ.. కొంపల్లి, మాదాపూర్‌లోని కార్యాలయాలు ఏర్పాటు చేసి, కస్టమర్లతో సమావేశాలు నిర్వహించారు. ఇక్కడ ప్రతి చదరపు అడుగుకు రూ. 3,200 చొప్పున ‘ప్రీ-లాంచ్ ఆఫర్’ ద్వారా భారీ డిపాజిట్‌లను సేకరించారు. ఫ్లాట్‌ల విక్రయంపై భారీ కమీషన్‌ను ఆఫర్‌ చేసి మరీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వీరిద్దరూ కంపెనీ సీఈవోగా తొడ్డాకుల నర్సింహారావును నియమించారు. దీంతో భారీగా ఆఫర్లతో కస్టమర్ల నుంచి రూ. 80 కోట్ల వరకు వసూలు చేశారు. కానీ, ఇప్పటిదాకా కనీసం పునాదులు కూడా తీయలేదు.

నిర్మాణం చేయకుండానే.. భూమిని అమ్మేశారు

భారతీ లేక్​ వ్యూ పేరుతో రంగుల కలను బ్రోచర్లలో చూపించిన యాజమాన్యం.. వినియోగదారులను మోసం చేసింది. అపార్ట్‌మెంట్లు కట్టకుండా మొత్తం భూమిని వేరే పార్టీకి అమ్మేశారు. భారతీ బిల్డర్స్ అధినేత శివరామ కృష్ణ ములుకూరి.. ఓ లగ్జీరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును కొంపల్లిలో 2021లో సుమారు 7 ఎకరాల్లో మొదలు పెట్టినట్లు ప్రకటించారు. 8 బ్లాకులు, 9 ఫ్లోర్లతో ప్రాజెక్టు కస్టమర్లను మోసం చేసేందుకు భారీ పన్నాగం పన్నారు. దాదాపు 656 డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ అంటూ బ్రోచర్లలో చూపించి.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మేశారు. ఈ ప్రాజెక్టు పేరు చెప్పుకుని థర్డ్ పార్టీ నుంచి రూ. 30 కోట్లు ఫైనాన్స్ తెచ్చాడు. ఇలా ప్రీలాంచ్​ పేరుతో వచ్చిన ఆ డబ్బులతో భానూర్ లో సుమారు 6 ఎకరాల భూమికి అడ్వాన్స్ చెల్లించి, కేవలం అగ్రిమెంట్ చేసుకుని 5 టవర్లు, 15 ఫ్లోర్లు, 960 ఫ్లాట్స్ అంటూ అక్కడ కూడా ఓ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఇక్కడ వచ్చిన డబ్బులతో.. ఇంకా మరిన్ని చోట్లలో అడ్వాన్స్ లు ఇచ్చి, అగ్రిమెంట్ చేసుకుని, కమర్షియల్, రెసిడెన్సియల్ ఫ్లాట్స్ అమ్మకాలు చేస్తామని ప్రచారం చేసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు ప్రీలాంచ్​ పేరుతో వసూలు చేసి.. ఆయా ప్రాంతాల్లో భూములు కొనడం.. ప్రీలాంచ్‌​ అంటూ వసూళ్లు చేస్తూ నిలువునా మోసం చేశారు.

రెరా చూసినా టైంపాస్​

కన్ స్ట్రక్షన్ విలువ చదరపు మీటర్ రూ. 5 వేల పైనే ఉంటే.. కేవలం రూ. 1500 ఇస్తున్నామంటూ గతంలో చెప్పుకొచ్చారు. ఇదంతా గమనిస్తే.. ప్రీలాంచ్​ పేరుతో జనాలను మోసం చేయాలనే ప్లాన్​ను ముందుగానే పతాక రచన చేసి ఇదంతా చేస్తునట్లు తెలిసిపోతుంది. అయితే, ప్రీలాంచ్​ దందాపై పలుమార్లు పిర్యాదులు వచ్చినా.. టీఎస్ రెరా నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం చూస్తే.. అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏమేరకు ఉన్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు అసలు మోసం బయటకు రావడంతో.. బాధితులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles