- పేరు: ది ట్విన్స్
- ఫ్లాట్ సైజు: 16 వేల చ.అ.
లగ్జరీ అనే పదానికి నిర్వచనాన్ని మారుస్తూ.. దేశంలోనే అత్యద్భుత లగ్జరీ ప్రాజెక్టులకు హైదరాబాద్ వేదిక అవుతోంది. భారతదేశంలోని ఓ 85 మంది ప్రివిలేజ్డ్ వ్యక్తుల కోసం.. ఓ మహత్తరమైన ప్రాజెక్టు ఆరంభమైంది. విలాసానికే విలాసమైన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులో నివసించాలని భావించే వారి కోసమే ఈ నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం.. సుమారు పదహారు వేల చదరపు అడుగులు ఉంటుంది. ఔను.. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం.. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది. రెండు ట్విన్ టవర్ల ఎత్తు 44 అంతస్తులు కాగా.. ప్రతి ఫ్లోరులో కేవలం ఒక్క ఫ్లాటే ఉంటుంది. రెండు టవర్లలో కేవలం 85 ఫ్లాట్లు వచ్చేలా ప్లాన్ చేశారు.
ఇంతటి భారీ ప్రాజెక్టుకు వేదికగా నిలిచింది.. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలోని పొప్పాల్ గూడ ప్రాంతం. ప్రాజెక్టు పేరేమో.. డీఎస్సార్, ఎస్ఎస్ఐ ట్విన్స్. 3.6 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు లగ్జరీ నిర్వచనాన్ని సమూలంగా మార్చివేస్తుంది. నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ టవర్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్కో ఫ్లోర్ ఎత్తు.. 13 అడుగులు ఉంటుంది. ఒక ఫ్లోర్ ఎత్తు ఇంత ఎత్తులో నిర్మిస్తున్న ప్రప్రథమ ప్రాజెక్టు ఇదే. ద ట్విన్స్‌లో ఒక్క క్లబ్ హౌజే సుమారు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. అంటే, 85 కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఇంత బడా క్లబ్ హౌజ్ అన్నమాట. లగ్జరీకే సరికొత్త నిర్వచనం చెప్పేలా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో అత్యాధునిక సదుపాయాలన్నీ డిజైన్ చేశారు. స్పా, ఇన్‌ఫినిటీ పూల్, స్క్వాష్ కోర్టు, స్నూకర్, జిమ్, కాన్ఫరెన్స్ రూమ్, కేఫ్‌టీరియా వంటివన్నీ పొందుపరుస్తారు.