పాన్ ఇండియా నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రను అంతర్జాతీయ శిఖరాలకు తీసుకెళ్లిన బాహుబలిగా ఆయన పేరు ఎక్కడైనా మార్మోగుతూనే ఉంటుంది. తెలుగు సినీ నిర్మాత యు.సూర్యనారాయణరాజు చిన్న కుమారుడైన ప్రభాస్.. త్వరలో కల్కిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ లో నివసిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో పెద్ద తోటతో కూడిన ఓ విలాసవంతమైన భవనంలో ఆయన ఉంటున్నారు. ప్రభాస్ ఇంట్లో ఇండోర్ స్విమింగ్ పూల్, గ్రూమ్డ్ గార్డెన్, దిగుమతి చేసుకున్న పరికరాలతో కూడిన సూపర్ ప్రీమియం జిమ్ వంటివి ఎన్నో ఉన్నాయి. బంగ్లా వెలుపలి భాగం తెలుపు రంగులో గణనీయమైన వుడ్ వర్క్ తో కూడి ఉంటుంది.
అత్యంత అద్భుతమైన ఈ భవనంలోని గృహోపకరాలన్నీ ప్రభాస్ నిరాడంబరమైన అభిరుచులను దృష్టిలో ఉంచుకుని అంతకంటే అద్భుతంగా తీర్చిదిద్దారు. ఫొటో ఫ్రేమ్ లను ఎంతో సృజనాత్మకంగా అమర్చారు. ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న ఫొటోగ్రాఫ్ లలో ప్రభాస్ అద్భుతమైన అభిరుచి ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రభాస్ ఇల్లు ఎంతో విశాలంగా, విలాసవంతంగా ఉన్నప్పటికీ, చాలా ప్రాథమికంగా, సహజమైన గాలి, వెలుతురు లోపలకు వచ్చేలా ఉంటుంది. ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రభాస్ తన వ్యక్తిగత అభిరుచులను జోడించినట్టు స్పష్టంగా తెలుస్తుంది.
ప్రభాస్ ఇంటి వెలుపలి భాగం తెలుపు, గోధుమ రంగుతో కనిపిస్తుంది. పెద్ద పెద్ద గోడలు, ఇంటి వెలుపలి భాగాలకు తెల్లని రంగు వేశారు. వెడల్పైన చెక్కతో కూడిన ఫ్రెంచ్ కిటికీలు, తలుపులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇంటి ముందు పెద్ద వాకిలి స్వాగతం పలికితే, ప్రవేశద్వారం ప్రాంతం చెట్లు, సుందరమైన పూల తోటతో కనువిందు చేస్తుంది. ఇంటి స్తంభాల చుట్టూ పెనవేసుకున్న లతలు, తీగలు అక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి. ప్రభాస్ తోటపని చేస్తున్నప్పుడు, గడ్డిపై పని చేస్తున్నప్పుడు తీసుకున్న ఫొటోలను అందరితో పంచుకున్నారు. చెట్లను నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలను ప్రోత్సహించడంలో ఆయన చూపే ఉత్సాహం అందరికీ తెలిసిందే.
ప్రభాస్ ఇంటికి మరో ఆకర్షణ భారీగా ఉండే స్పైరల్ మెట్లు. ఆ పక్కనే ఉన్న గోడ మొత్తం తన కుటుంబం, స్నేహితులతో కూడిన చిత్రాలతో కనిపిస్తుంది. ఇల్లు మొత్తం వెచ్చని క్రీమ్ టోన్ లలో పెయింట్ చేశారు. పెద్ద ఓవర్ హ్యాంగింగ్ షాండ్లియర్ ఇంటికి రాజసాన్ని తెచ్చింది. ఆ ఇంటికి తగ్గట్టుగానే బ్యానిస్టర్ వద్ద కింగ్ సైజ్ పియానో చక్కదనాన్ని, వైభవాన్ని వెదజల్లుతుంది.
This website uses cookies.