50 మిలియన్ చదరపు అడుగులు
దాటనున్న లీజింగ్ కార్యకలాపాలు
దేశంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో జోరు కొనసాగుతుందని ఫిక్కీ-కొలియర్స్ నివేదిక వెల్లడించింది. 2024లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ సరికొత్త స్థాయికి వెళుతుందని.. 50 మిలియన్ చదరపు అడుగుల మైలురాయిని అధిగమిస్తుందని అంచనా వేసింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల మరింత పుంజుకోవడంతో ఆఫీస్ స్పేస్ లీజింగ్ దూకుడు మరింత పెరుగుతుందని, మొత్తం లీజులో వీటి వాటా 40 శాతానికి పైగా ఉంటుందని తెలిపింది. ఇంజనీరింగ్, తయారీ రంగాలతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల ద్వారా గ్రేడ్ ఏ ఆఫీస్ స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది.
అయితే, ఫ్లెక్స్ స్పేస్ లు మొత్తం లీజులో 15 నుంచి 20 శాతం వరకు ఉండొచ్చని వివరించింది. లక్ష, అంతకంటే ఎక్కువ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్ ఒప్పందాలు 2024లో సగం పైనే ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. దేశీయ సంస్థలు, జీసీసీల నుంచి అధిక డిమాడ్ వల్ల దేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా 60 మిలియన్ చదరపు అడుగుల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.