Categories: Celebrity Homes

దేశం వెలుపల ఫామ్ హౌస్ కట్టుకుంటా

బిగ్ బాస్ ఫేమ్ సోనియా బన్సల్

డెకర్, కలర్స్, టైల్స్, లైటింగ్, షాడోలు, ప్యాటర్న్ లు.. ఇంకా స్టైల్స్ వంటి అంశాలు టాలీవుడ్ నటి సోనియా బన్సల్ కలల సౌధం డిజైన్ ను అదరగొట్టేలా చేయడంతోపాటు వాటిలో ఆమె వ్యక్తిత్వం ప్రతిఫలించేలా చేస్తాయి. ఇవన్నీ ఆమె ఎంపికలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. తగినన్ని వనరులు అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరికీ విభిన్నమైన రుచి, స్టైల్ అనేది ఉంటుంది. ధీర సెలబ్రిటీ సోనియా బన్సల్ కూడా అంతే.

‘నేను చిన్నప్పుడు పిల్లల ఇల్లు కట్టాను. ఇప్పుడు నాకు నచ్చిన ఆదర్శవంతమైన ఇల్లు కట్టుకుంటున్నాను. ప్రతి అంశమూ నా మదిలో ఉందని భావిస్తున్నా. అయితే, ఇంటీరియర్ డిజైనర్ నియమించుకోవాలో లేదో ఇంకా తేల్చుకోలేకపోతున్నాను’ అని సోనియా తెలిపారు. మన ఇష్టాలను నిర్ధారించుకోవడానికి ఎవరికో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏముందనేది సోనియా భావన. డిజైనర్ మనం ఇచ్చే డబ్బుకు తగిన విలువ కలిగినవాడేనని, మన ఇష్టాలు, శైలికి కొత్త ఆలోచనలు జోడించడంతోపాటు సమస్యలను కలిసి పరిష్కరిస్తాడని, బాధ్యతాయుతంగా ఉంటాడని చెబుతున్న సోనియా.. అవన్నీ తనకూ తెలుసని పేర్కొన్నారు.

ఆమె మరో విషయాన్ని చెబుతూ.. ‘నాకు కలల ఫామ్ హౌస్ ఉంది. దానిని నిర్మించాలనేది నా కల. దానిని నా దేశం వెలుపల చాలా ఏకాంతమైన ప్రదేశంలో కట్టలనుకుంటున్నాను. మన దేశం వెలుపల ఫామ్ హౌస్ లను వెతుకుతున్నాను. ఎందుకంటే నేను కోరుకుంటున్న ఫామ్ హౌస్ కట్టడం మన దేశంలో కుదరదు. ఒకవేళ నాకు సరైన ఆలోచన వచ్చి, అందుకు తగిన వ్యక్తులు దొరికితే ఇక్కడే కట్టుకుంటాను’ అని వెల్లడించారు.

ఆమె కోరుకుంటున్న చిన్న ఫామ్ హౌస్ డిజైన్ సొగసు, సింప్లిసిటీ కలబోసిన మిశ్రమంగా ఉంటుంది. చక్కని లేఔట్, క్లాసిక్ ఎలిమెంట్స్, ఆమె కోరుకునే సౌకర్యవంతమైన జీవన వాతావరణం ఉట్టిపడేలా ఉండాలనేది ఈ బిగ్ బాస్ స్టార్ ఆలోచన. ‘నేను కూడా దుబాయ్ లో ప్రాపర్టీ కొన్నాను. నన్ను నేను సెలబ్రిటీగా పరిగణించుకోను. నా మనసులో డెకర్ పై పిచ్చి లేకుంటే నేను ఇలాంటి డెకర్ పై ఎలా పని చేస్తాను? నేను చాలా ప్రశాంతమైన అమ్మాయిని. నా డెకర్ దానిని ప్రతిబింబిస్తుంది. డెకర్ అనేది ఆడంబరంగా ఉండకూడదు. అలా ఉంటే అతిథులు అంతగా ఇష్టపడరు. ఇది నా కలల సౌధమే అయినప్పటికీ, నా లివింగ్ రూమ్ లో స్నేహితులతో తరచుగా గడిపేలా ప్లాన్ చేసుకుంటున్నాను.

నేను ఫ్లాట్ ను ఎందుకు ఇష్టపడతానో, అలాగే ఇంత పెద్ద ఫ్యాన్సీ హౌస్ ను ఎలా ఉంచుకోవాలో అని అప్పుడప్పుడూ ఆందోళన కూడా చెందుతుంటా’ అని వివరించారు. తన గ్లామర్, సొగసుతో దుబాయ్.. సోనియా బన్సల్ హృదయాన్ని కూడా గెలచుకుంది. ఇది ఏమీ అంత ఆశ్చర్యం కలిగించే అంశం కాదు. ఎందుకంటే అక్కడ తిరుగులేని విలాసవంతైన ఇంటిని ఎవరు మాత్రం కోరుకుండా ఉంటారు? ఇప్పుడు ఆమె దుబాయ్ లో సొంత రియల్ ఎస్టేట్ కలిగి ఉన్నారు. అక్కడి రియల్ మార్కెట్లో ఆమె కోరుకున్న భాగం కలిగి ఉన్నారు. ఈ బిగ్ బాస్ ఫేమ్ కి ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది?

This website uses cookies.