Categories: TOP STORIES

నిబంధ‌న‌ల్ని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు

టీఎస్ రెరా ఛైర్మ‌న్ డా.ఎన్ స‌త్య‌నారాయ‌ణ

బిల్డర్లు, ప్రమోటర్లు.. రెరా రిజిస్ట్రేషన్ పొంది నిర్మాణ పనులు చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన‌ త్రైమాసిక నివేదికలు, వార్షిక అకౌంట్స్ ఆడిట్ నివేదికల‌ను సమర్పించాల‌ని టీఎస్ రెరా ఛైర్మ‌న్ డా.ఎన్ స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. శుక్ర‌వారం బెంగళూరుకు చెందిన న్యాయవాది పార్ట్నర్ ట్రయల్ బేస్ సోహెల్ అహ్మద్, ఛార్టెడ్ అకౌంటెంట్ వినయ్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సిస్టం ద్వారానే ఉల్లంఘనలపై అప్రమత్తం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. కొనుగోలుదారుల ఆసక్తి, హక్కుల మేరకు బిల్డర్లు, ప్రమోటర్లు సకాలంలో నివేదికల్ని సమర్పించాలని ఆయన సూచించారు.

* ట్రయల్ బేస్ అడ్వకేట్ పార్టనర్ సోహెల్ అహ్మద్, ఛార్టెడ్ అకౌంటెంట్ టి. వినయ్ లు మాట్లాడుతూ.. బిల్డర్లు, ప్రమోటర్లు ఇచ్చిన హామీలు విఫలమైతే రెరా చట్ట ప్రకారం శిక్షార్హులని తెలిపారు. రెరాను ఉల్లంఘించిన ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయని, వాటిని బ్లాక్ లిస్టులో పెట్టడ‌మే కీలక ఆయుధమని వివరించారు. బిల్డర్లు, ప్రమోటర్లు తాము చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన త్రైమాసిక నివేదికలు, వార్షిక ఎకౌంట్స్, ఆడిట్‌ నివేదికలు సకాలంలో సమర్పించడంలో గుజరాత్ 99 శాతం, మహారాష్ట్ర 75 శాతం, తమిళనాడు శాతం, కర్ణాటక 60 శాతంతో ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్లు వివ‌రించారు.

* నష్ట పరిహారాల చెల్లింపుల‌కు సంబంధించి కర్ణాటక, తమిళనాడు తదితర హైకోర్టు తీర్పులను ఉదాహరించారు. బిల్డర్లు, ప్రమోటర్ల బాధ్యతలతో పాటు కొనుగోలుదారుల హక్కులు, చెల్లించిన డబ్బు తిరిగి వాపసు పొందడం, జరిమానాలు విధించడం, ఫిర్యాదులు వాటి పరిష్కారం, అసోసియేషన్ల‌ ఏర్పాటు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ తదితర విషయాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో రెరా సభ్యులు కే. శ్రీనివాసరావు, జే. లక్ష్మీనారాయణ, అడ్జుడికేటింగ్ ఆఫీసర్ సయ్యద్ లతీఫ్ ర్ రహమాన్, లీగల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్తయ్య, రెరా పరిపాలన అధికారి గంగాధర్, జాయింట్ డైరెక్టర్ అశ్విని, రవీందర్, శ్రీనివాస్, గోపాల్, అంజయ్య, లీగల్ టీమ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

This website uses cookies.