ఫైర్ ఎన్వోసీ తీసుకోని 26 హైరైజ్ వాణిజ్య భవనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ)ని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే ఆ భవనాలను సీజ్ చేయాలని స్పష్టంచేసింది. అలాగే 1,128 రెసిడెన్షియల్ భవనాలు, 259 హైరైజ్ భవనాలపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది. వీటిపై రెండు వారాల్లోగా చర్యలు తీసుకుని జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు మున్సిపాలిటీల్లోని 2160 భవనాలపై ప్రభుత్వం సర్వే నిర్వహించగా 1833 భవనాలు నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై ఐదు వారాల్లోగా ఓ పరిష్కారం కనుక్కోవాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.