Categories: TOP STORIES

లోతట్టు ప్రాంతాల్లో కొంటున్నారా?

వర్షాకాలం వచ్చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇక్కట్టు తప్పవు. హైదరాబాద్, ముంబై వంటి మహానగరాలు సైతం చిన్నపాటి వానకే విలవిలాడతాయి. ఈ నేపథ్యంలో ఇల్లు కొనేవారు లేదా అద్దెకు తీసుకునేవారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ప్రాంతంలో వర్షాకాలం ఎలా ఉంటుంది? డ్రైనేజీ సౌకర్యం ఉందా అనే విషయాలు పరిశీలించాలి. ఒకవేళ అక్కడ వరద ముప్పు ఉంటే అలాంటి ప్రదేశాల్లో ఇల్లు కొనడం లేదా అద్దెకు వెళ్లడం మంచిది కాదు. తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే కొనుక్కోవాలి.

అది కూడా ఇతర ప్రాంతాల కంటే తక్కువ రేట్లకు దొరికితే మాత్రమే పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపాలి. సాధారణంగా వేరే ప్రాంతాల్లో ఎక్కువ మొత్తం వెచ్చించలేని వారు.. కాస్త ఇబ్బంది ఉన్న పర్లేదు అక్కడ కొనుగోలు చేయడానికి చూస్తారు. నిజానికి బిల్డర్లకు కూడా అలాంటి ప్రాంతాల్లో కట్టిన ఇళ్లను అమ్మడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. అందుకే ఇతర ప్రాంతాలతో పోలిస్తే 20 నుంచి 25 శాతం మేర తక్కువ రేటుకు అమ్మాల్సి వస్తుంది. ఇల్లు అనేది భారీ బడ్జెట్ తో కూడుకున్నది కావడంతో చాలా మంది వర్షాకాలం సర్దుకుపోదాం అని భావించి.. కాస్త తక్కువ ధరకు ఆయా ప్రాంతాల్లో ఇంటిని కొనుగోలు చేస్తారు.

This website uses cookies.