హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలంటే కేవలం మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులు వంటి ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. అధిక శాతం ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులోనే దర్శనమిస్తుంటాయి. కానీ, తాజాగా మియాపూర్ ఇందుకు వేదికగా మారింది. నలభై అంతస్తుల ఆకాశహర్మ్యం నిర్మించేందుకు బెంగళూరుకు చెందిన క్యాండియర్ సంస్థ ముందుకొచ్చింది. జీహెచ్ఎంసీ, తెలంగాణ రెరా అథారిటీల నుంచి తుది అనుమతి తీసుకుని ఆరంభమైన ఈ ప్రాజెక్టును ప్రత్యేకతల్ని చూస్తే.. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.
లగ్జరీ జీవితాన్ని ఆస్వాదించాలని అందరికీ ఉంటుంది. కాకపోతే, ఆకాశహర్మ్యాల్లో రెండు పడక గదుల్ని నిర్మించేందుకు అధిక శాతం మంది బిల్డర్లు పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. కానీ, అలా కాకుండా లగ్జరీ జీవన విధానాన్ని రెండు పడక గదుల ఫ్లాట్లను కొన్నవారికీ అందించాలన్న ఒక చక్కటి ఉద్దేశ్యంతో.. బెంగళూరుకు చెందిన క్యాండియర్ సంస్థ మియాపూర్‌లో క్యాండియర్ 40కి శ్రీకారం చుట్టింది.
సుమారు 4.8 ఎకరాల విస్తీర్ణంలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టులో వచ్చేవి మూడు టవర్లే. ఇందులో ఇరవై శాతమే నిర్మాణ స్థలం కాగా.. మిగతా అంతా ఆధునిక సదుపాయాలు, సౌకర్యాలు, పచ్చదనం కోసం కేటాయించారు. మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. 959 కాగా ఫ్లాట్ల విస్తీర్ణం 1170 నుంచి 1610 విస్తీర్ణంలో నిర్మిస్తారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు క్యాండియర్ శరవేగంగా నిర్మాణ పనుల్ని జరిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతల్ని గమనించిన అధిక శాతం మంది కొనుగోలుదారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఒక మంచి లొకేషన్‌లో, చూడచక్కగా డిజైన్ చేసిన ప్రాజెక్టుకు చక్కటి ఆదరణ ఉంటుందని క్యాండియర్ అమ్మకాల్ని చూస్తే చెప్పొచ్చు.