ఫ్లోర్ ఏరియా రేషియోపై నిబంధనలు మార్చిన యూపీ
ఫ్లోర్ ఏరియా నిష్పత్తిపై ప్రస్తుతం ఉన్న నిబంధనలను మారుస్తూ ఉత్తరప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం బిల్డర్లు ఎలాంటి అనుమతులూ లేకుండా అదనపు ఫ్లోర్లను నిర్మిస్తున్నారు. అనంతరం ప్రభుత్వానికి అనుమతి చేసుకుని దానిని క్రమబద్ధీకరించుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్సీఆర్ లో ఇలాంటివి బాగా ఎక్కువయ్యాయి. ఈ పథ్యంలో అక్రమంగా నిర్మించే ఫ్లోర్లకు అనుమతి ఇవ్వకుండా కూల్చివేస్తామని యూపీ సర్కారు తేల్చి చెప్పింది. చాలామంది బిల్డర్లు తొలుత తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా అదనపు ఫ్లోర్లు నిర్మిస్తున్నారనే ఫిర్యాదులపై ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ అదనపు అంతస్తులు నిర్మించాలనుకుంటే తొలుత అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.