Categories: LATEST UPDATES

తలసరి రిటైల్ స్పేస్ 2 చ.అ.లే!

అమెరికా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో సంఘటిత రిటైల్ వ్యాపారం 10 శాతం కంటే తక్కువే. యూఎస్లో తలసరి వ్యవస్తీకృత రిటైల్ స్పేస్ 23 చ.అ., దుబాయ్లో 16 చ.అ.గా ఉండగా… మన దేశంలో మాత్రం 2 చ.అ.లుగా ఉంది. గత ఐదేళ్లలో భారతదేశ తలసరి ఆదాయం 12 శాతం వృద్ధి రేటుతో 1,961 డాలర్లకు పెరిగిందని అనరాక్ రిటైల్ సీఓఓ అండ్ జాయింట్ ఎండీ పంకజ్ రెంజెన్ తెలిపారు. ఏటా సంఘటిత దేశీయ రిటైల్ మార్కెట్ 20–25 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 2019లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కొత్తగా 85 లక్షల చ.అ. మాల్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 73 శాతం వృద్ధి. గతేడాది కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా వరకు ఇంటికే పరిమితం అయ్యారు. అవసరమైన వస్తువులు, నిత్యావసరాలను ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో భౌతిక రిటైల్ స్పేస్ అవసరం క్షీణించింది. ఫలితంగా 2019తో పోలిస్తే గతేడాది కొత్త రిటైల్ మాల్ స్పేస్ 75 శాతం క్షీణించి.. 21 లక్షల చ.అ.లకు చేరింది. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కొత్తగా 45 లక్షల చ.అ. షాపింగ్ మాల్ స్పేస్ అందుబాటులోకి రానుంది.

This website uses cookies.