ఇంటి అద్దెను పదే పదే అడుగుతూ విసిగిస్తున్నాడని ఒక రియల్టర్ ఏకంగా ఇంటి ఓనర్ మీదే కేసు పెట్టిన ఉదంతమిది. ఈ సంఘటన ఎక్కడో మారుమూల పల్లెటూరులోనో లేదా పట్టణంలోనో జరగలేదు. సాక్షాత్తు హైదరాబాద్ నడిబొడ్డున.. హైటెక్ సిటీకి చేరువలోని మాదాపూర్‌లో జరగడం విశేషం. రియల్ ఎస్టేట్ గురుకి తెలిసిన సమాచారం ప్రకారం.. వెంచర్లను డెవలప్ చేసే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్‌లో ఏర్పాటు చేశాడో రియల్టర్. అయితే, గత కొంతకాలం నుంచి ఇంటి ఓనర్‌కు అద్దె చెల్లించట్లేదట. రియల్టర్ నుంచి రావాల్సిన అద్దె కనీసం రూ. 14 లక్షలు దాకా ఉంటుందట.
అద్దె గురించి గుర్తు చేస్తుండటంతో.. తన మీద కేసు పెట్టాడని ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. సదరు రియల్టర్ మాదాపూర్ నుంచి ఆఫీసును తీసేశాడు. ఇక అప్పట్నంచి ప్రతిరోజు ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఆయా ఫ్లాటుకు వస్తున్నారట. ఇంటి యజమానిని కలుస్తున్నారట. కొందరేమో కోటీ రూపాయలు ఇవ్వాలంటే.. మరికొందరేమో రెండు నుంచి మూడు కోట్లు ఇవ్వాలని అంటున్నారట. ఇంతకీ ఆయా రియల్టర్ ప్రజల నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేసి ఏమయ్యాడో.. ఆఫీసు ఇంకెక్కడికి షిప్ట్ చేశాడో..!
This website uses cookies.