Categories: LATEST UPDATES

ఇవి మొక్కలు కాదు.. ఆక్సిజన్ బాంబులు

  • ఇంట్లో స్వచ్ఛమైన గాలినిచ్చే మొక్కలివిగో

బయట ఎక్కడ చూసినా కాలుష్యం.. దుమ్ము, ధూళి. రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి అయితే మరీ ఘోరం. ఈ పరిస్థితుల్లో మనం ఎక్కువ సేపు గడిపే మన ఇంట్లో స్వచ్ఛమైన గాలి ఉండటం తప్పనిసరి. బయట కాలుష్యం అలా ఉంటే ఇంట్లో స్వచ్ఛమైన గాలి ఎలా పెంపొందించుకోవాలి? ఇందుకోసం నాసా ఇండోర్ ఎయిర్ ప్యూరిఫయర్ల జాబితా విడుదల చేసింది. కొన్ని రకాల మొక్కలను మన ఇంట్లో ఉంచుకుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తాయని పేర్కొంది. ఆ మొక్కల వివరాలు ఇవీ..

అజలేయాస్

అజలేయాస్ మొక్కలు కిచెన్లలో గాలిని శుభ్రం చేస్తాయి. ఇది టాక్సిక్ డిటర్జెంట్లను ఉపయోగించేవారికి మంచి చాయిస్.

ఇంగ్లిష్ ఐవీ (హెడెరా హెలిక్స్)

ఇది చాలా దూకుడైన మొక్క. గాలిలోని మల పదార్థ కణాలను, సిగరెట్ పొగను తొలగిస్తుంది. ఇంగ్లిష్ ఐవీ మొక్కకు నిర్వహణ కూడా చాలా తక్కువ.

పీస్ లిల్లీ (స్పతిఫిలమ్)

ఈ మొక్కను మీ లాండ్రీ లేదా బాత్రూమ్ లో ఉంచండి. ఎందుకంటే ఇది అక్కడి గాలి నాణ్యతను పెంపొందిస్తుంది. పీస్ లిల్లీ పెరగడానికి ఎక్కువ నీరు లేదా సూర్యకాంతి అవసరం లేదు. ఇది అందమైన పువ్వులు కూడా ఇస్తుంది. పీస్ లిల్లీ గాలి నుంచి ఫార్మాల్ డీహైడ్, ట్రైక్లోరెథెలిన్ ను కూడా తొలగిస్తుంది. అయితే, ఇది పిల్లులకు విషపూరితం కాబట్టి మీ ఇంట్లో పెట్స్ ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

వెదురు (చమడోరియా సీఫ్రిజి)

వెదురు పామ్ మొక్క దాదాపు 10 అడుగుల వరకు పెరుగుతుంది. ఇంట్లో ఎక్కడైనా ఇవి సరిపోతాయి. ఈ మొక్క బెంజీన్, ట్రైక్లోరో ఇథైలీన్ లను తొలగిస్తుంది. ఫార్మాల్ డీహైడ్ ను గ్యాస్ వచ్చే ఫర్నిచర్ దగ్గర వీటిని ఉంచితే మంచి ప్రయోజనం కలుగుతుంది.

చైనీస్ సతతహరిత (అగ్లోనెమా)

వాయు కాలుష్యం, విష వాయువులను తొలగించే విషయంతో ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది తక్కువ కాంతిలోనే వృద్ధి చెందుతుంది. బెర్రీలు, పువ్వులు కూడా ఇస్తుంది.

కలబంద (అలోవెరా)

ఇది నిర్వహణ తక్కువగా ఉండే మరో మొక్క. అద్భుతమైన వైద్య శక్తి కలిగి ఉన్న అలోవెరాను ఔషధ మొక్కగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో విటమిన్ ఎ, సి, ఇ, బీ1, బీ2, బీ12 పుష్కలంగా ఉన్నాయి. తెగిన, కాలిన గాయాలకు చికిత్స చేయడానికి అలోవెరా జెల్ ను ఉపయోగిస్తారు. అలోవెరా శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా ఆల్కలీన్ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటిని మీ కిటికీలలో కుండీలలో పెంచుకోవచ్చు.

పెలర్గోనియం

ఇది గాలిని శుభ్రపరుస్తుంది. దుర్వాసనలను తొలగిస్తుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. పెలర్గోనియం ఎసెన్షియల్ ఆయిల్ మీరు బాగా నిద్రపోవడానికి, మీ నాడీ వ్యవస్థను చక్కగా ఉంచడానికి సహకరిస్తుంది.

స్పైడర్ ప్లాంట్ (క్లోరోపైటమ్ కోమోసమ్)

ఈ మొక్కకు సహజకాంతి ఇష్టమే. అయితే, నేరుగా సూర్యకాంతిని మాత్రం ఇష్టపడదు. దీనిని మీ ఆఫీసులో అలంకరణ మొక్కలా ఉంచుకోవచ్చు. స్పైడర్ ప్లాంట్ తక్కువ నిర్వహణ మొక్క. ఇది వంటగది నుంచి కార్బన్ మోనాక్సైడ్ ను తొలగిస్తుంది.

రబ్బర్ ప్లాంట్ (ఫికస్ ఎలాస్టికా)

రబ్బరు మొక్క ఒకే పరిమాణంలో ఉన్న ఇతర మొక్కల కంటే తక్కువ కాంతి, తక్కువ ఉష్ణోగ్రతలలో పెరుగుతుంది. ఫికస్ గ్రూప్ మొక్కలన్నింటిలో రబ్బరు మొక్కే శక్తివంతమైంది. టాక్సిన్స్, కాలుష్య కారకాలను తొలగించడంలో ఇది చాలా ఉత్తమమైనది.

స్నేక్ ప్లాంట్ (సాన్సేవిరియా ట్రిఫాసియాటా)

ఈ మొక్క రాత్రి వేళ పనిచేస్తుంది. స్నేక్ ప్లాంట్ కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుని రాత్రివేళ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కను మీ బెడ్ రూమ్ లో లేదా తివాచీలు ఉన్న మరేదైనా గదిలో ఉంచాలి. మీ కార్పెట్, కలప ఫర్నిచర్ నుంచి విడుదలయ్యే ఫార్మాల్ డీహైడ్ ను తొలగించే తక్కువ నిర్వహణ మొక్క.

This website uses cookies.