జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్ సీడీఆర్సీ) విచారించే కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వస్తువులు లేదా సేవలకు సంబంధించి రూ.2 కోట్లు ఆ పై విలువ కలిగిన కేసులను ఎన్ సీడీఆర్సీ విచారించనుంది. ఇప్పటివరకు ఇది రూ.10 కోట్లుగా ఉండేది. అలాగే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కమిషన్లలో మార్పులు చేస్తూ కేంద్రం నోటిఫై చేసింది. కొత్త నిబంధనల ప్రకారం జిల్లా కమిషన్ల ఫిర్యాదు పరిధి రూ.50 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటివరకు ఇది రూ.కోటిగా ఉండేది. ఇక రాష్ట్ర స్థాయి కమిషన్లు రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు విలువ కలిగిన కేసులను విచారిస్తాయి. గతంలో ఇది రూ.కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఉండేది. రూ.2 కోట్లకు పైబడిన కేసులు జాతీయ వినియోదారుల వివాదాల పరిష్కార కమిషన్ పరిధిలోకి వస్తాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది
This website uses cookies.