హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాతబస్తీ మెట్రోరైలు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు అని.. మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఒరిజినల్ సిటీని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నామని చెప్పారు. గండిపేట నుంచి నగరంలోని 55కి.మీ ల పరిధిలో మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. నగర ప్రతిష్ఠను నిలబెట్టేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళతామని తెలిపారు.