హైదరాబాద్ లో బిల్డింగ్ నిర్మాణంలో అనుమతి కావాలంటే చదరపు అడుక్కీ రూ. 75 వసూలు చేయాలని నిర్ణయించారని.. రైట్ రాయల్ ట్యాక్స్ లెక్క ముగ్గురు మనుషులని పెట్టి.. వారు చెబితేనే అనుమతి ఇచ్చేటట్లుగా, ఆ ముగ్గురికి డబ్బులు చెల్లించాలని నిర్ణయం జరిగినట్టు తెలుస్తుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి ఇక్కడికొచ్చి తెలంగాణలో డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని.. 360 డిగ్రీస్ లో పరిశీలన చేస్తున్నాం.. కేర్ ఫుల్ గా ఉండమని ఇప్పటికే హెచ్చరికలు చేసి వెళ్లారని విమర్శించారు. బిల్డింగ్ ల కోసం, భూముల విషయంలో ఇచ్చిన రిలాక్సేషన్ విషయంలో.. పాతవారిని మళ్లీ పిలిపించుకుని..
పాత ప్రభుత్వం 100 రూపాయలు వసూలు చేస్తే రేవంత్‌రెడ్డి 200 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉందని.. కానీ, ఇప్పటివరకు ఒక అనుమతి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. మొత్తానికి, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందన్నారు. ప్రభుత్వ ఆదాయ వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయని.. రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని.. ఈ తరుణంలో భూముల విలువల్ని పెంచడం కరెక్టు కాదని ఆయన అన్నారు.
This website uses cookies.