Categories: LATEST UPDATES

సీనియర్ హోమ్స్ తో కొలంబియా పసిఫిక్

రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ

కొలంబియా పసిఫిక్ మొదటిసారిగా సీనియర్ లివింగ్ కమ్యూనిటీల ద్వారా దేశంలోని వృద్ధుల కోసం అద్దె మోడల్ లోకి ప్రవేశిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని తొమ్మిది నగరాల్లో 2వేల గృహాలతో ఎనిమిది కమ్యూనిటీలు కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోంది. అమెరికాకు చెందిన కొలంబియా పసిఫిక్ కమ్యూనిటీస్ (సీపీసీ) రెండేళ్లలో దేశంలో 2 మిలియన్ చదరపు అడుగుల సీనియర్ లివింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. ఏటా 800 నుంచి వెయ్యి సీనియర్ లివింగ్ హోమ్స్ జోడించాలని యోచిస్తున్నామని, ఒక్కో ప్రాజెక్టుకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కొలంబియా పసిఫిక్ కమ్యూనిటీస్ సీఈఓ మోహిత్ నిరులా తెలిపారు. ప్రస్తుతం సీపీసీ బెంగళూరు, కొయంబత్తూరు, చెన్నై, కాంచీపురం, పాండిచ్చేరిలో పని చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి పుణెలోకి ప్రవేశించాలని యోచిస్తోంది.

‘2024-25 ఆర్థిక సంవత్సరంలో ముంబై, హైదరాబాద్, కోల్ కతాలో ప్రవేశిస్తాం. బెంగళూరులో కనీసం ఒక కొత్త ప్రాజెక్టు చేపడతాం. అలాగే చెన్నైలో రెండు, హైదరాబాద్ లో ఒకటి లేదా రెండు ప్రాజెక్టులు మొదలుపెడతాం’ అని నిరులా వెల్లడించారు. సీనియర్ లివింగ్ కమ్యూనిటీలు వృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నివాస అపార్ట్ మెంట్లు. వీల్ చైర్లు, ఫ్రెండ్లీ డోర్లు, యాంటీ-స్కిడ్ ఫ్లోరింగ్, సహాయకుల వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొయంబత్తూర్ వంటి నగరాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టులు వచ్చాయి. ప్రస్తుతం సీపీసీ ఇండిపెండెంట్ సీనియర్ లివింగ్ మోడళ్లు కలిగి ఉంది. ఇక్కడ సీనియర్లు స్వతంత్రంగా జీవించవచ్చని, రోజువారీ కార్యకలాపాలకు ఎవరి సాయం అవసరం లేకుండా ఇక్కడ ఉండొచ్చని నిరులా తెలిపారు. అయితే, ప్రస్తుతం సహాయక జీవన కమ్యూనిటీలు (లేదా అద్దె నమూనాలు) అనే కొత్త మోడల్ చూస్తున్నామని, ఇక్కడ సీనియర్ల రోజువారీ కార్యకలాపాలకు కూడా సహాయం అవసరమని వివరించారు. ఈ విధానంలో సీనియర్లు ప్రామాణిక నివాస అపార్ట్ మెంట్లను అద్దెకు ఇచ్చినట్టే డిపాజిట్ చెల్లించిన తర్వాత నెలవారీ అద్దెకు సీనియర్ లివింగ్ అపార్ట్ మెంట్ లను అద్దెకు తీసుకొచ్చని.. అదనం సీపీసీ డెవలపర్ నుంచి కొంత శాతం రాబడిని నిర్వహణ రుసుముగా వసూలు చేస్తుందని తెలిపారు. బెంగళూరు వంటి ప్రాంతాల్లో వీటి అద్దె రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఉంటుందని చెప్పారు.

This website uses cookies.