ప్రీలాంచుల్లో మహారాజు అయిన పారిజాత డెవలపర్స్‌పై నగరానికి చెందిన ఒక పోలీసు స్టేషన్లో మహిళా బాధితురాలు ఫిర్యాదు చేసిందని సమాచారం. ఈ సంస్థ ఎండీ నరేష్ కుమార్‌తో పాటు పలువురు సభ్యులను పోలీసులు పిలిపించారని తెలిసింది. ఎందుకంటే, పారిజాత డెవలపర్స్‌లో ఒక మహిళ సుమారు పాతిక లక్షలకు పైగా సొమ్ము చెల్లిస్తే.. ఆమెకు ఆ సొమ్మును వెనక్కి ఇవ్వకుండా.. సుమారు ఆరేళ్ల నుంచి పారిజాత యాజమాన్యం సతాయిస్తుందని సమాచారం. అందుకే, ఆమెకు విసుగొచ్చి సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరి, పోలీసులు కేసు నమోదు చేశారా? లేక ఎప్పటిలాగే సెటిల్‌మెంట్ చేసి పంపించేశారా అనేది రియల్ ఎస్టేట్ గురు తెలుసుకునే ప్రయత్నంలో పడింది.
* గత ఆరేళ్ల నుంచి ఇలా పారిజాత డెవలపర్స్ కు సొమ్ము కట్టి మోసపోయినవారు వెయ్యి మందికి పైగా ఉంటారని తెలిసింది. మరి, ఈ సంస్థ ఎప్పుడు ఆరంభమైంది? ఎన్ని వెంచర్లను చేపట్టింది? అందులో మొదలైనవి ఎన్ని? ఎంత మంది వద్ద ప్రీలాంచ్‌లో సొమ్ము వసూలు చేశారు? ఆరంభించిన వెంచర్లు, ప్రాజెక్టులెన్నీ? అవి ఏ స్థాయిలో ఉన్నాయి? వంటి వివరాల్ని రియల్ ఎస్టేట్ గురు సేకరించే పనిలో నిమగ్నమైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉన్న ఈ కార్యాలయానికి ప్రతిరోజు బాధితులు వస్తుంటారని.. పారిజాత డెవలపర్లు వారికి మొహం చాటేస్తుంటారని తెలిసింది. వీరంతా కార్యాలయానికి రాకుండా.. ప్రతిరోజు నగరంలోని ఏదో ఒక గెస్ట్ హౌస్‌లో టైం పాస్ చేస్తుంటారు.
* మీలో ఎవరైనా పారిజాత డెవలపర్స్ వద్ద ప్రీలాంచ్‌లో ఇన్వెస్ట్ చేసి.. మోసపోయి ఉంటే గనక.. మీ పూర్తి ఆధారాలతో సహా మా మెయిల్‌కు పంపించండి. మా చిరునామా: regnews21@gmail.com.
This website uses cookies.