Categories: LATEST UPDATES

ఆందోళ‌న‌లో భువ‌న‌తేజ బాధితులు

భువ‌న‌తేజ ఇన్‌ఫ్రాలో ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించి.. నాలుగు వంద‌ల‌కు పైగా కొనుగోలుదారుల్ని మోసం చేసిన కేసులో పోలీసులు సంస్థ ఎండీ చ‌క్కా వెంక‌ట‌సుబ్ర‌మ‌ణ్యంను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌తిరోజు కొంద‌రు బాధితులు సీసీఎస్‌కు వెళ్లి తాము కూడా మోస‌పోయామంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నార‌ని తెలిసింది. అయితే, అధికారికంగా పోలీసుల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల కాక‌పోవ‌డంతో..

భువ‌న‌తేజ బాధితుల్లో కొంత‌ ఆందోళ‌న నెల‌కొంది. త‌మ సొమ్ము వెన‌క్కి వ‌స్తుందా? లేదా? అంటూ పోలీసుల్ని సైతం వీరంతా ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిసింది. భువ‌న‌తేజ ఇన్ఫ్రాతో సంబంధ‌మున్న చ‌క్కా వెంక‌ట‌సుబ్ర‌మ‌ణ్యం కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు, ముఖ్య‌మైన ఏజెంట్ల‌ను లోతుగా విచారించి.. ఎవ‌రి పేరు మీద బినామీ ఆస్తులున్నాయో గుర్తించి.. త‌మ సొమ్మును వెన‌క్కి ఇప్పించాల‌ని మోస‌పోయిన బాధితులు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.

This website uses cookies.