అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు పొందేందుకు 112 హెల్ప్ లైన్ ని వినియోగించుకోవాలని చండీగఢ్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలపై క్షేత్ర స్థాయి సిబ్బందికి ఫిర్యాదులు చేయాల్సి వస్తోంది. అలాంటి సమయాల్లో కొందరి ఐడెంటిటీ బయటకు వచ్చి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి చెక్ చెప్పేందుకు 112 హెల్ప్ లైన్ ని ఇందుకు వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశాన్ని యూటీ సలహాదారు ధరమ్ పాల్ ముందు దృష్టికి తీసుకెళ్లారు. లాల్ డోరాకి బయట ఉన్న గ్రామాల్లోని 250 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు తెలిపారు.